
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 64


యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుకు హ్యాపీ బర్త్‌డే

తుగ్లక్ అప్ డేట్ త్వరలో సెట్స్ పైకి


వరుస సినిమాలతో క్యాలెండర్ బిజీ

నెగెటివ్ రోల్ లో హీరోయిన్ హన్సిక ?

బన్నీ-త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ప్రారంభం

కోలీవుడ్ మూవీ లో విలన్ గా బాలీవుడ్ సూపర్ స్టార్

మరోసారి సంక్రాంతికి రానున్న `డిస్కో రాజా`?

మారుతి డైరెక్షన్ లో మెగా హీరో?

చిరంజీవి టైటిల్స్‌తో వస్తున్న కొత్త చిత్రాలు

‘అర్జున్ సురవరం’ ముఖ్య అతిథి ఎవరంటే...!

1మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిన ‘జెర్సీ’

మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్

విజయ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో!

కాంచన రీమేక్ కు ఇంట్రెస్టింగ్ టైటిల్
లారెన్స్ రాఘవ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ముని సినిమా.. దాని సీక్వెల్ లో వచ్చిన కాంచన, గంగ సినిమాలు ఎంత ఘన విజయం సాధించాయో తెలుసు. ఇక ఇటీవల ఈ సీక్వెల్ ను కొనసాగిస్తూ వచ్చిన కాంచన 3 సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇదిలా ఉండగా లారెన్స్ కాంచన చిత్రాన్ని హిందీలోను రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

రెండు వారాల గ్యాప్‌లో... రకుల్ ప్రీత్ డబుల్ ధమాకా
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న రకుల్ ప్రీత్ సింగ్… ఆ మధ్య తెలుగు సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి కోలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ భాషల్లో ఆమె నటించిన రెండు సినిమాలు మే నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతున్నాయి. ఆ చిత్రాలే ‘దే దే ప్యార్ దే’, ‘ఎన్.జి.కె.’.

యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుకు హ్యాపీ బర్త్‌డే
మాస్ పల్స్ తెల్సిన అతికొద్ది మంది దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకడు. యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నా… తన సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో దిట్ట. భారీ కాస్టింగ్‌తో వెండితెరను కలర్ ఫుల్‌గా తీర్చిదిద్దడమే కాకుండా… యాక్షన్ ఎపిసోడ్స్‌ను కూడా కళ్ళు తిప్పుకోలేనంతగా రూపొందించగల టాలెంటెడ్ డైరెక్టర్. ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన బోయపాటి… ఆ తర్వాత ‘తులసి’, ‘సింహా’, ‘దమ్ము’, ‘లెజెండ్’, ‘సరైనోడు’ చిత్రాలతో టాలీవుడ్‌లో “వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్”గా ఎదిగాడు.

తుగ్లక్ అప్ డేట్ త్వరలో సెట్స్ పైకి
పటాస్ సినిమా తరువాత మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కు చాలా రోజుల తరువాత '118' సినిమాతో మంచి సక్సెస్ దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత వేణు మల్లిడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి కూడా విదితమే. ఎన్నో కథలు విన్న కళ్యాణ్ రామ్ కు వేణు చెప్పిన స్టోరీ నచ్చడంతో ఈ సినిమాకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.అంతేకాదు ఈ సినిమాకు 'తుగ్లక్' అనే పేరు పెట్టినట్టు వార్తలు కూడా వచ్చాయి. మరి ఇదే టైటిల్ ఉంచుతారో? టైటిల్ మార్చుతారో? తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాలి.

ఉత్తేజ్ ప్రారంభించిన మయూఖా యాక్టింగ్ స్కూల్ కు నా అండ దండలు ఎప్పుడూ ఉంటాయి- పూరి జగన్నాథ్
“మా ఫిలిం ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు నూతన నటీనటులు కావాలి.. ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభం అవుతున్న "మయూఖా టాకీస్ ఫిలిం యాక్టింగ్ స్కూల్ " మంచి ఆర్టిస్టులను ఇండస్ట్రీకి అందించగలదన్న నమ్మకం నాకుంది" అన్నారు సుప్రసిద్ధ దర్శకులు పూరి జగన్నాథ్. ఈరోజు ఉదయం హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో "మయూఖా టాకీస్" యాక్టింగ్ స్కూల్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు పూరి జగన్నాథ్.

మహర్షి నుండి 'పదరా పదరా' సాంగ్ రీలీజ్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సిల్వర్ జూబ్లి సినిమా మహర్షిపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. మే 9వ తేదీన రిలీజ్ కానున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుసగా పాటలు కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకూ మూడు పాటలు రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఈ చిత్రంలోని 'పదరా పదరా' నాల్గవ సాంగ్ ని విడుదల చేశారు.

వరుస సినిమాలతో క్యాలెండర్ బిజీ
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న విషయం ఎవరికీ అర్ధమైనా అర్థకాకపోయినా హీరోయిన్లకు మాత్రం బాగా అర్దమవుతుంది. కెరీర్ ప్రారంభంలో కరెక్ట్ హిట్ పడిందంటే చాలు అవకాశాలు వెతుక్కుంటూ మరీ వస్తాయి. ఇక ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటారు. ఇక గత రెండు మూడేళ్లలో ఎంతో మంది కొత్త కథానాయకలు టాలీవుడ్ కు పరిచయమయ్యారు. వారిలో కొంత మంది మాత్రం వరుస సినిమాలతో.. తీరిక లేకుండా షూటింగ్‌లతో గడుపుతున్నారు.

నాని, సుధీర్ బాబు ల మల్టీస్టారర్ కు ముహూర్తం ఫిక్స్
ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ల కాంబినేషన్ లో మల్టీస్టారర్ తెరకెక్కబోతున్నట్టు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు వ్యూహం అనే టైటిల్ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారని టాక్స్ వినిపించాయి. అయితే ఆ తరువాత అది కూడా కాదన్న వార్తలు వినిపించాయి.

నెగెటివ్ రోల్ లో హీరోయిన్ హన్సిక ?
టాలీవుడ్ లో దేశముదురు, కోలీవుడ్ లో మాప్పిళ్ళై వంటి సూపర్ హిట్ మూవీస్ ద్వారా హీరోయిన్ గా పరిచయమైన హన్సిక కోలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న AA 19 మూవీ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించేందుకు హన్సిక అంగీకరించారని, ఈ మూవీ లో ఆమె పాత్ర కీలకమని, హన్సిక సినీకెరీర్ లో ఒక విభిన్న పాత్ర అవుతుందని సమాచారం.

బన్నీ-త్రివిక్రమ్ మూవీ షూటింగ్ ప్రారంభం
త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. అయితే ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చూస్తున్న ఎదురుచూపులకు బ్రేక్ పడింది. ఫైనల్ గా ఈ రోజు ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు చిత్రయూనిట్. హైదరాబాద్ లోని బేగంపేట పోలీస్ లైన్స్ లో తొలి షెడ్యూల్ షూటింగును ప్రారంభించినట్టు తెలుస్తోంది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారట.

కోలీవుడ్ మూవీ లో విలన్ గా బాలీవుడ్ సూపర్ స్టార్
దక్షిణాది భాషల సినిమాలలో బాలీవుడ్ హీరోలు ప్రతి నాయకుడిగా నటించడం కొత్తకాదు. రీసెంట్ గా 2.0 మూవీ లో అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కోలీవుడ్ కు విలన్ గా పరిచయమవుతున్నారు. AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అట్లీ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా రూపొందుతున్న దళపతి 63 మూవీ దీపావళి పండుగకు రిలీజ్ కానుంది. హీరో విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్న ఈ మూవీ కై చెన్నై లో EVP స్టూడియో లో భారీ ఫుట్ బాల్ స్టేడియం సెట్ ను రూపొందించారు.

మరోసారి సంక్రాంతికి రానున్న `డిస్కో రాజా`?
మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం డిస్కో రాజా అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అంతేకాదు… పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ వీఐ ఆనంద్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ఓ షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. కాగా… తదుపరి షెడ్యూల్ మే మూడో వారం నుంచి జరుగనుందని సమాచారం. ఆ పై శరవేగంగా చిత్రీకరణ జరిపి… వి.ఎఫ్.ఎక్స్ వర్క్‌పై దృష్టి సారించనున్నారని తెలిసింది. అలాగే… సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు…

మారుతి డైరెక్షన్ లో మెగా హీరో?
ఎట్టకేలకు సాయి తేజ్ కు చిత్రలహరి సినిమాతో పెద్ద రిలీఫే దొరికింది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరు ఫ్లాప్ లతో సతమతమవుతున్న ఈ యంగ్ హీరోకు ఈసారి మాత్రం హిట్ తప్పనిసరైంది. అలాంటి పరిస్థితుల్లో తన ఆశలన్నీ చిత్రలహరి సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇక తన అంచనాలను నిజం చేస్తూ మంచి టాక్ నే సంపాదించుకుంది. కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది.

చిరంజీవి టైటిల్స్‌తో వస్తున్న కొత్త చిత్రాలు
ప్రజాదరణ పొందిన పాత సినిమాల టైటిల్స్‌తో కొత్త చిత్రాలు రావడం తెలుగు పరిశ్రమలో కొత్తేమీ కాదు. అనాదిగా ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అయితే.. ఒకే కథానాయకుడికి సంబంధించిన పాత సినిమాల టైటిల్స్‌తో అరడజను కొత్త చిత్రాలు ఒకే ఏడాదిలో రావడం మాత్రం అరుదే. ఆ హీరో మెగాస్టార్ చిరంజీవి కాగా… ఆ చిత్రాలు ప్రాణం ఖరీదు, గ్యాంగ్ లీడర్, రాక్షసుడు, హీరో, జ్వాల, ఖైదీ.

ఒకే రోజున ఇద్దరు తెలుగు దర్శకుల తొలి హిందీ చిత్రాలు
జూన్ 21, 2019… ఓ అరుదైన విషయానికి వేదిక కానుంది. అదేమిటంటే… అదే రోజున టాలీవుడ్‌కి చెందిన ఇద్దరు యువ దర్శకులు హిందీనాట తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆ దర్శకులు మరెవరో కాదు.. సందీప్ రెడ్డి వంగ, కోవెలమూడి సూర్య ప్రకాష్.అర్జున్ రెడ్డి వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన సందీప్… ఇప్పుడు అదే చిత్రాన్ని కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

‘అర్జున్ సురవరం’ ముఖ్య అతిథి ఎవరంటే...!
వైవిధ్యభరితమైన చిత్రాలతో ఆకట్టుకుంటున్న యువ కథానాయకుడు నిఖిల్… మరో భిన్నమైన కథతో ‘అర్జున్ సురవరం’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి టి.ఎన్.సంతోష్ దర్శకత్వం వహించాడు. తాజాగా విడుదలైన టీజర్ కూడా ఈ సినిమా పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే… మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా… ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

1మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిన ‘జెర్సీ’
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘జెర్సీ’… ఇటు ప్రేక్షకులతో పాటు అటు ప్రముఖులను అలరించడమే కాకుండా… బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక… ఓవర్సీస్‌లోనూ వసూళ్ళను బౌండరీలను దాటించేస్తోంది. మంగళవారం నాటికి 1మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరడమే కాకుండా… ఈ క్లబ్‌లో నానికు డబుల్ హ్యాట్రిక్‌ను అందించింది. ఇప్పటికే నాని నటించిన ‘ఈగ’, ‘భలే.. భలే.. మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘నిన్నుకోరి’, ‘ఎం.సి.ఎ.’ చిత్రాలు కలెక్షన్ల పరంగా‘జెర్సీ’ కంటే ముందున్నాయి. వీటిలో ‘భలే.. భలే…

మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి మూవీ మే 9వ తేదీ రిలీజ్ కానుంది. హీరో మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన మహర్షి మూవీ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా, వైజయంతీ మూవీస్ బ్యానర్స్ పై రూపొందింది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

విజయ్ సినిమాలో కన్నడ స్టార్ హీరో!
ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా కూడా ఇటీవలే ప్రారంభమైంది. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లే డి హీరోయిన్స్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు.

పోటా పోటీగా జెర్సీ, కాంచన3 కలెక్షన్లు
ఏప్రిల్ నెల టాలీవుడ్ కు బాగా కలిసొచ్చింది. గత కొద్ది రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో మజిలీ, చిత్రలహరి, జెర్సీ సినిమాలు సూపర్ హిట్స్ అందించాయి. ఇక డబ్బింగ్ సినిమా కాంచన 3 కూడా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు రెండు సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఆ సినిమాలు జెర్సీ, కాంచన3. రెండు సినిమాలు ఒకే రోజు రిలీజై కలెక్షన్లు రాబట్టడంలో పోటా పోటీగా ఉన్నాయి. ముఖ్యంగా బి. సి సెంటర్లలో ఈ రెండు సినిమాలు ఒకదానితో ఒకటి గట్టి పోటీనే ఎదుర్కొంటున్నాయి.