సి. అశ్వనీదత్… భారీ బడ్జెట్ చిత్రాలకు చిరునామాగా నిలచిన సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్. వైజయంతీ మూవీస్ సంస్థ అధినేతగా పలు ఘనవిజయాలను తన ఖాతాలో వేసుకున్నారాయన. అంతేకాదు… నిన్నటితరం అగ్ర కథానాయకులతోనూ… ఈ తరం స్టార్ హీరోలతోనూ అనేక చిత్రాలను నిర్మించారు దత్. ఇక అసలు విషయానికొస్తే… నిన్నటితరం అగ్ర కథానాయకుడు సూపర్‌స్టార్ కృష్ణకి కలిసొచ్చిన నిర్మాతగా అశ్వనీదత్ కి మంచి పేరే ఉంది. కృష్ణ కథానాయకుడిగా ‘గురు శిష్యులు’, ‘అడవి సింహాలు’, ‘అగ్నిపర్వతం’వంటి చిత్రాలను నిర్మించారు దత్. తొలి, మలి చిత్రాల మాటెలా ఉన్నా… మూడో చిత్రంగా వచ్చిన అగ్ని పర్వతం
మాత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ కుంభవృష్టి కురిపించడమే కాకుండా… కృష్ణ కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది. కట్ చేస్తే… ఇప్పుడు కృష్ణ తనయుడు సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో కూడా ఆ ఫీట్‌ను రిపీట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ స్టార్ ప్రొడ్యూసర్ .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘రాజకుమారుడు’(1999) సినిమాతో మహేష్‌ను హీరోగా పరిచయం చేసారు అశ్వనీదత్. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో… ఏడేళ్ళ విరామం తరువాత మహేష్ కాంబినేషన్‌లో ‘సైనికుడు’(2006) చిత్రాన్ని నిర్మించారు. జయాపజయాల సంగతి పక్కన పెడితే… మ్యూజికల్ గానూ, మహేష్ పెర్ఫార్మెన్స్ పరంగానూ ఈ సినిమా ఆకట్టుకుంది. కాగా… పదమూడేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత… ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మహేష్ కాంబినేషన్‌లో ‘మహర్షి’ని నిర్మించారు దత్. అయితే… ఈ సారి ‘దిల్’ రాజు, ప్రసాద్ వి.పొట్లూరితో కలసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరి… కృష్ణ కాంబినేషన్‌లో దత్ నిర్మించిన మూడో చిత్రం అగ్ని పర్వతం
ఎలాగైతే అప్పటి సూపర్ స్టార్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిందో… అలాగే మహేష్ హీరోగా దత్ నిర్మిస్తున్న మూడో సినిమా ‘మహర్షి’ కూడా ఇప్పటి సూపర్ స్టార్ కెరీర్‌లో మెమరబుల్ మూవీ అవుతుందేమో చూడాలి. కొసమెరుపేంటంటే… మహేష్‌ను హీరోగా పరిచయం చేసిన అశ్వనీదత్ నే… ఇప్పుడు అతని సిల్వర్ జూబ్లీ (25వ) చిత్రాన్ని కూడా నిర్మిస్తుండడం విశేషం.
[subscribe]
[youtube_video videoid=1ozSzjlQ9y0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: