కుటుంబ కథా చిత్రాలకు చిరునామాగా నిలచిన కథానాయకుడు విక్టరీ వెంకటేష్. ఆయన నటించిన పలు కుటుంబ కథా చిత్రాలు విశేషాదరణ పొందాయి. వాటిలో ‘ఆడవారిమాటలకు… అర్థాలేవేరులే!’ ఒకటి. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకీ సరసన త్రిష కథానాయికగా నటించగా… ఇతర ముఖ్య పాత్రల్లో కోట శ్రీనివాస రావు, శ్రీరామ్, కె.విశ్వనాథ్, సునీల్, జీవా, కలర్స్
స్వాతి, రాజ్యలక్ష్మి, ప్రసాద్ బాబు తదితరులు నటించారు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్, ఎస్.నాగ అశోక్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. యువన్ శంకర్ రాజా స్వరకల్పనలో రూపుదిద్దుకున్న పాటలన్నీ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. 2007 ఏప్రిల్ 27న విడుదలైన ఈ చిత్రం… నేటితో 12 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ఆడవారిమాటలకు… అర్థాలేవేరులే!’ – కొన్ని విశేషాలు:
- వెంకటేష్, త్రిష జంటగా నటించిన తొలి చిత్రమిది. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో ‘నమో… వెంకటేశ’, ‘బాడీగార్డ్’ సినిమాలు వచ్చాయి.
- సెల్వరాఘవన్, యువన్ శంకర్ రాజా కాంబినేషన్‌లో వెంకటేష్ నటించిన ఏకైక చిత్రం.
- ఈ సినిమాతో ఉత్తమ నటిగా త్రిష ఫిలింఫేర్‌ను సొంతం చేసుకోగా… ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (వెంకటేష్), ఉత్తమ మాటల రచయితలు(రమేష్, గోపి) విభాగాలలో నంది అవార్డులు వరించాయి.
- ‘ఖుషి’ విడుదలైన రోజునే… ఆ సినిమాలోని రీమిక్స్ పాటైన “ఆడవారి మాటలకు అర్థాలేవేరులే” టైటిల్‌తో సినిమా రావడం, ఆదరణ పొందడం విశేషం.
- ఈ సినిమాని తమిళంలో ‘యారడి నీ మోహిని’ పేరుతో రీమేక్ చేసారు. అందులో ధనుష్, నయనతార జంటగా నటించారు. అంతేకాదు… ధనుష్ కెరీర్‌లో తొలి తెలుగు రీమేక్ చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే… ఈ సినిమాని కన్నడం(‘అందు ఇందు ప్రీతి బందు’), బెంగాలీ(‘100%లవ్’), భోజ్‌పురి(‘మెహంది లగాకే రఖ్నా’), ఒడియా(‘ప్రేమ అదై అక్ష్యరా’) భాషల్లోనూ పునర్నిర్మించారు.
[subscribe]
[youtube_video videoid=zApfsNJJR8Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: