వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ తో మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్ బ్యానర్స్ పై నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సూపర్ హిట్ మూవీ మన్మథుడు సీక్వెల్ మన్మథుడు2 మూవీ రూపొందుతుంది. రావు రమేష్, వెన్నెల కిషోర్, సీనియర్ నటి లక్ష్మి, తమిళ నటి దేవదర్శిని, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ RX 100 పాటలతో యూత్ లో హుషారు రేకిత్తించిన చైతన్ భరద్వాజ్ మన్మథుడు2 మూవీ కి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మన్మథుడు2 మూవీ షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ లో జరుగుతుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన స్టిల్స్ లో నాగార్జున అందంగా , యంగ్ హీరో లా ఉన్నారు. నాగార్జున -రకుల్ జంట చూడముచ్చటగా ఉంది. 60 సంవత్సరాల చేరువలో ఉన్న నాగార్జున యంగ్ హీరోలకు ధీటు గా ఉన్నారు. హీరో నాగార్జున కు మన్మథుడు టైటిల్ సూటబుల్ గా ఉంది. పోర్చుగల్ షూటింగ్ షెడ్యూల్ లో స్టంట్ సీన్స్ ను నాగార్జున బ్యాలెన్సింగ్ చేసిన స్టిల్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.



[subscribe]
[youtube_video videoid=j7B34XDQ3Bo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























