తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా సూర్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే… గతేడాది సంక్రాంతికి గ్యాంగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సూర్య… ఇప్పుడు ఎన్జీకే సినిమాతో రానున్నాడు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవ్వడంతో రిలీజ్ ఆలస్యం అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై అభిమానులలో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. తాజాగా ఈసినిమా ట్రైలర్ మరియు ఆడియో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఏప్రిల్ 29వ తేదీన ట్రైలర్ ను ఆడియోను రిలీజ్ చేయనున్నారు.
కాగా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈసినిమాలో సూర్యకి జంటగా రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్. ప్రభు నిర్మాణంలో రూపొందుతున్నఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు. రంజాన్ సందర్భంగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. మరి అభిమానుల అంచనాలను సూర్య రీచ్ అవుతారో?లేదో? చూద్దాం.
ఈ సినిమాతో పాటు కేవీ ఆనంద్ తెరకెక్కిస్తున్న మరో సినిమాలో కూడా సూర్య నటిస్తున్నాడు. ఇంకా పలు సినిమాలు లైన్లో ఉన్నట్టు తెలుస్తోంది.
[subscribe]
[youtube_video videoid=7zaC2gTGA2o]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























