ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు చిత్ర పరిశ్రమలో రాణించడం అరుదైన విషయమే. అయితే… అంతకుమించిన అరుదైన విషయం మాత్రం ఒకే కుటుంబంలో మూడు తరాల దర్శకులు ఉండడం అనే చెప్పాలి. ముఖ్యంగా… కోవెలమూడి కుటుంబం విషయానికి వస్తే… కేవలం తెలుగులోనే కాదు పొరుగు పరిశ్రమలోనూ సినిమాలు చేస్తూ అరుదైన రికార్డు సొంతం చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఎవర్ గ్రీన్ క్లాసిక్ ప్రేమ నగర్
ను అందించిన కె.ఎస్. ప్రకాష్‌రావు ఆ సినిమా రీమేక్‌తో హిందీలోనూ తనదైన ముద్ర వేశారు. ఇక ఆయన తనయుడు కె.రాఘవేంద్రరావు కూడా తెలుగుతో పాటు హిందీ పరిశ్రమలోనూ పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. కట్ చేస్తే… కె.ఎస్.ప్రకాష్‌రావు మనవడు, కె.రాఘవేంద్రరావు తనయుడు కోవెలమూడి సూర్యప్రకాష్ కూడా ఇదే బాటలో వెళుతున్నాడు. తెలుగులో అనగనగా ఓ ధీరుడు
, సైజ్ జీరో
చిత్రాలను తెరకెక్కించిన సూర్యప్రకాష్… ఇప్పుడు కంగనా రనౌత్, రాజ్‌కుమార్ రావ్ కాంబినేషన్‌లో మెంటల్ హై క్యా?
అనే హిందీ సినిమాని రూపొందిస్తున్నాడు. మరి… తాత, తండ్రి బాటలోనే సూర్యప్రకాష్ కూడా బాలీవుడ్‌లో విజయం అందుకుని ఓ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాడేమో చూడాలి. కాగా… మైంటల్ హై క్యా?
జూన్ 21న తెరపైకి రానుంది.
[subscribe]
[youtube_video videoid=AFxOnqxezRA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: