బ్లాక్ బస్టర్ మూవీ ఛలో తో టాలీవుడ్ కు ఎంటరయిన కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న ఆ మూవీ ఘనవిజయంతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారారు. తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక, విజయ్ దేవరకొండ తో జంటగా నటించిన గీత గోవిందం మూవీ ఘనవిజయం తో స్టార్ డమ్ పొందారు. లక్కీ హీరోయిన్ రష్మిక కు మూవీ ఆఫర్స్ వెల్లువెత్తాయి. రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ మూవీ మే నెలలో రిలీజ్ కానుంది. భీష్మ, AA 20, హీరో కార్తీ తో తమిళ మూవీ కమిట్ అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 26మూవీ లో కూడా రష్మిక నటించే అవకాశం ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ రూపొందించే బాలీవుడ్ మూవీ కై రష్మిక ను సంప్రదించినట్టు సమాచారం. స్క్రిప్ట్ విన్న రష్మిక తన అంగీకారం తెలుపవలసి ఉంది. రణదీప్ హుడా హీరోగాసంజయ్ లీల భన్సాలీ రూపొందించే మూవీ ఆగస్ట్ లో ప్రారంభం కానుంది. హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్, రౌడీ రాథోడ్, గలి యోంకి రాసలీలా, మేరీకోమ్, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ రూపొందించిన సంజయ్ లీల భన్సాలీ మూవీ లో రష్మిక కు అఫర్ రావడం అదృష్టమే.
[subscribe]
[youtube_video videoid=r6yjcLgY8p4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: