ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 24
భలేగా ప్లాన్ చేసిన బన్నీ
ఏ హీరో చేయని సాహసం చేయబోతున్న రాహుల్ విజయ్
నా సొంత బ్యానర్లోనే తరువాత సినిమా..

25 గెటప్పుల్లో విక్రమ్?

తలసాని పై తప్పుడు ప్రచారానికి తప్పదు భారీ మూల్యం
'కౌసల్య కృష్ణమూర్తి' రిలీజ్ డేట్ ఫిక్స్

'ఆకాశవాణి'కి రాజమౌళి మార్పులు

సాహో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ ?

రాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్?

AA 21 మూవీ అక్టోబర్ లో ప్రారంభం
నా కోరిక చిరంజీవి గారి స్థాయికి ఎదగాలి
`గ్యాంగ్ లీడర్`కి నాని సెంటిమెంట్
విరాటపర్వం 1992 మూవీ లో ఫోక్ సింగర్
నక్సలిజమ్ నేపథ్యంలో చిరు 152?
యన్టీఆర్ టైటిల్స్‌తో కొత్త చిత్రాలు

ఇండస్ట్రీ హిట్ ‘మగధీర’కు 10 ఏళ్ళు
`రణరంగం` ట్రైలర్ అప్‌డేట్
ప్రస్తుతం తెలుగునాట పిరియాడికల్ టచ్ ఉన్న సినిమాల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే... 90ల కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ శర్వానంద్ ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా చేశాడు. అదే `రణరంగం`. ఇందులో రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో శర్వా దర్శనమివ్వనున్నాడు. అతనికి జోడీగా కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ నటించారు.
భలేగా ప్లాన్ చేసిన బన్నీ
ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీ సెట్స్‌పై ఉండగా... సుకుమార్, వేణుశ్రీరామ్ దర్శకత్వంలో చేయనున్న చిత్రాలు త్వరలో పట్టాలెక్కనున్నాయి. అంతేకాదు... ఈ మూడు సినిమాలను ఏడాది గ్యాప్‌లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశాడట బన్నీ.
ఏ హీరో చేయని సాహసం చేయబోతున్న రాహుల్ విజయ్
ఇటీవలే సూర్యకాంతం సినిమాతో మంచి మార్కులు కొట్టేసాడు స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్. ఆ సినిమాలో నిహారిక మెయిన్ లీడ్ ఐనా రాహుల్ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. ఓ కొత్త దర్శకుడితో కొత్త సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
నా సొంత బ్యానర్లోనే తరువాత సినిమా..
ఆర్ఎక్స్ 100 సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ.. ఇటీవలే హిప్పీ తో ప్రేక్షకులను అలరించాడు. అయితే హిప్పీ నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు 'గుణ 369' తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ లో పాల్గొన్న కార్తికేయ తన కొత్త సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నాడు.

25 గెటప్పుల్లో విక్రమ్?
విభిన్నమైన పాత్రలు చేయడంలో విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. పాత్రలతో ప్రయోగాలు చేయడం అంటే ఆయనకు మొదటినుండి ఇంట్రెస్ట్. అందుకే ఇప్పటివరకూ ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రాలు చేసి ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈసారి ఏకంగా 25 గెటప్పుల్లో కనిపించనున్నాడట.

తలసాని పై తప్పుడు ప్రచారానికి తప్పదు భారీ మూల్యం
మీడియాలో రాను రాను తప్పుడు ప్రచారాలు, వక్రభాష్యాల జోరు పెరిగిపోతుంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా కల్పనలు, కట్టుకథలతో వాస్తవాలను వక్రీకరించే వక్ర బుద్ధి మీడియాలో ఎక్కువైంది. అందుకు బోనాల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన బోనాల సంప్రదాయ నృత్యానికి గబ్బర్ సింగ్ సినిమాలోని " మందు బాబులం" అనే పాటను మార్ఫింగ్ చేసి పబ్లిష్ చేయటాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
'కౌసల్య కృష్ణమూర్తి' రిలీజ్ డేట్ ఫిక్స్
ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.47గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నఈ సినిమాకు రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. ఆగష్టు 23వ తేదీన ఈ సినిమా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

'ఆకాశవాణి'కి రాజమౌళి మార్పులు
రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా ఆకాశవాణి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలో కొన్ని మార్పులు చేస్తున్నాడంట రాజమౌళి. ఈ సినిమా లో విలన్ పాత్ర చాలా కీలకమట. కానీ.. షూటింగ్ అంతా అయిపోయాక… రాజమౌళికి ఈ పాత్రని తీర్చిదిద్దిన విధానం నచ్చలేదట. అందుకే… మరో నటుడిని తీసుకొని మళ్ళీ షూటింగ్ చేశారంటా. ఇప్పటికి షూటింగ్ ఓ కొలిక్కి వచ్చింది. నిజానికి ఆగస్టులోనే ఈ సినిమాని విడుదల చేయాలనుకున్నారు. రీషూట్ల వల్ల ఆలస్యం అయ్యింది. అన్ని పనులు త్వరగా పూర్తి చేసి తొందరలోనే మూవీ ని రిలీజ్ చేసే ప్లాన్ లో…

సాహో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ ?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వం లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. భారీ యాక్షన్ సీన్స్, అందమైన లొకేషన్స్ లో UV క్రియేషన్స్, T - సిరీస్ బ్యానర్స్ పై తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన సాహో మూవీ ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తుందనడం లో సందేహం లేదు.

రాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్?
పురాణ ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా అత్యంత భారీ స్థాయి లో రామాయణ సినిమా రూపొందించనున్న సంగతి తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా నిర్మించనున్న ఈ సినిమాను 'దంగల్' దర్శకుడు నితేశ్ తివారీ, 'మామ్' దర్శకుడు రవి ఉదయవర్ దర్శకత్వం వహించనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో 3 భాగాలుగా 3D వెర్షన్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

AA 21 మూవీ అక్టోబర్ లో ప్రారంభం
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, అందాల తార రష్మిక జంటగా AA 21 మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. దర్శకుడు సుకుమార్ స్టోరీ లైన్ ను అల్లుఅర్జున్ ఓకే చేశారు. బౌండ్ స్క్రిప్ట్ ను రెడీ చేసి రీసెంట్ గా సుకుమార్ అల్లు అర్జున్ కు నరేట్ చేశారు. అల్లు అర్జున్ ఆ స్క్రిప్ట్ కు థ్రిల్ ఫీలయ్యారని సమాచారం.
నా కోరిక చిరంజీవి గారి స్థాయికి ఎదగాలి
అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'గుణ 369'. ఆగష్ట్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బీజీగా వుంది చిత్ర బృందం.. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, టైలర్ ను రిలీజ్ చేయగా.. ఒక్కోక్కటిగా పాటలను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కార్తికేయ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
`గ్యాంగ్ లీడర్`కి నాని సెంటిమెంట్
`జెర్సీ` వంటి విజయవంతమైన చిత్రం తరువాత నేచురల్ స్టార్ నాని నుంచి వస్తున్న సినిమా `గ్యాంగ్ లీడర్`. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని తొలుత ఆగస్టు 30న విడుదల చేయాలనుకున్నారు. అయితే, అదే రోజున యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీ `సాహో` విడుదల కానుండడంతో... సెప్టెంబర్ ప్రథమార్ధానికి ఈ సినిమాని వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం... సెప్టెంబర్ 13న `గ్యాంగ్ లీడర్` రిలీజ్ కావచ్చని వినిపిస్తోంది. గతంలో సెప్టెంబర్ ఫస్టాఫ్‌లో వచ్చిన నాని చిత్రాలు `అష్టాచమ్మా` (2008), `భలే భలే మగాడివోయ్` (2015) మంచి విజయం సాధించాయి. ఈ…
విరాటపర్వం 1992 మూవీ లో ఫోక్ సింగర్
సక్సెస్ ఫుల్ మూవీ నీదీ నాదీ ఒకే కథ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నక్సలిజం నేపథ్యం లో రూపొందుతున్న పీరియాడిక్ లవ్ స్టోరీ విరాటపర్వం 1992 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి టబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ సాయి పల్లవి వరంగల్ ఫోక్ సింగర్ గా నటిస్తున్నారు. సాయి పల్లవి షూటింగ్ పార్ట్ ను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. రానా, సాయి పల్లవి కాంబినేషన్ సీన్స్ ను అక్టోబర్ నెలలో చిత్రీకరిస్తారని సమాచారం.
వారం గ్యాప్‌లో వస్తున్న `జబర్దస్త్` బ్యూటీస్
`జబర్దస్త్` టీవీ షోతో పాపులర్ అయిన అనసూయ, రష్మి... ఇప్పుడు వెండితెరపైనా తమదైన ముద్ర వేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు కీలక పాత్రల్లో నటిస్తూనే... మరో ప్రధాన పాత్రల్లోనూ సందడి చేస్తున్నారు ఈ టాలెంటెడ్ బ్యూటీస్. కాగా... ఈ `జబర్దస్త్` భామలు నటించిన కొత్త చిత్రాలు వారం గ్యాప్‌లో రానుండడం వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు... ఈ రెండు సినిమాలు కూడా థ్రిల్లర్ మూవీస్ కావడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే... రష్మి ప్రధాన పాత్రలో నటించిన `శివరంజిని` ఈ నెల 2న విడుదల కానుండగా... అనసూయ లీడ్ రోల్‌లో నటించిన `కథనం` ఈ నెల 9న రాబోతోంది. మరి... వారం గ్యాప్‌లో వస్తున్న ఈ…
పాట పాడుకుంటున్న `వెంకీమామ`
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ `వెంకీ మామ`. కె.యస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని డి.సురేశ్ బాబు, టీజీ విశ్వప్రసాద్ సంంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకీకి జోడీగా పాయల్ రాజ్‌పుత్, చైతూకి జంటగా రాశీఖన్నా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి థమన్ సంగీతమందిస్తున్నాడు.
నక్సలిజమ్ నేపథ్యంలో చిరు 152?
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ఆగస్టు 22న ప్రారంభం కానుంది. నవంబర్ నుంచి ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

2020 వేసవిలో `ఆ నలుగురు` అగ్ర కథానాయకుల సందడి
తెలుగు సినీ ప్రియులకు సంబంధించినంత వరకు... వేసవి అంటే వినోదాల విందు. ముఖ్యంగా... ఈ సీజన్‌లో ప్రతీ ఏడాది ఏదో ఒక అగ్ర కథానాయకుడి సినిమా సందడి చేస్తుండడం ఆనవాయితీగా మారింది. అయితే... 2020 వేసవి మాత్రం వెరీ వెరీ స్పెషల్ కానుంది. ఎందుకంటే... నలుగురు సీనియర్ స్టార్స్ 2020 సమ్మర్‌లో తమ కొత్త చిత్రాలతో సందడి చేయనున్నారు. ఆ స్టార్సే... మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్.
యన్టీఆర్ టైటిల్స్‌తో కొత్త చిత్రాలు
తెలుగునాట మహానటుడు నందమూరి తారక రామారావుది చిరస్మరణీయ ప్రస్థానం. అందుకే... యన్టీఆర్ నటించిన చిత్రాలే కాదు టైటిల్స్ కూడా టాలీవుడ్‌లో ఎవర్ గ్రీన్. నాటి అగ్ర కథానాయకులు ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ మొదలుకుని నేటి తరం అగ్ర కథానాయకుడు ప్రభాస్ వరకు... అంటే మూడు తరాల స్టార్ హీరోలు ఆయన పాత చిత్రాల టైటిల్స్‌తో కొత్త చిత్రాల్లో సందడి చేశారు.

ఇండస్ట్రీ హిట్ ‘మగధీర’కు 10 ఏళ్ళు
కథానాయకుడిగా నటించిన రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్‌ని సొంతం చేసుకోవడం అత్యంత అరుదైన రికార్డు. అలాంటి రేర్ ఫీట్‌తో దశాబ్దం క్రితం వార్తల్లో నిలిచాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. `మగధీర` రూపంలో నెలకొల్పిన ఆ రికార్డు... ఇప్పటికీ అలానే పదిలంగా ఉండడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా `చిరుత`తో కథానాయకుడిగా తొలి అడుగులు వేసిన చరణ్... రెండో చిత్రం `మగధీర`తో సంచలన విజయం అందుకున్నాడు. ఈ ఘనవిజయంలో దర్శకధీరుడు రాజమౌళి శ్రమ, విజన్ ప్రధాన భూమిక పోషించాయి. ఇక ఇదే సినిమాతో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందింది. శ్రీహరి, దేవ్ గిల్, రావు రమేష్, శరత్…