తలసాని పై తప్పుడు ప్రచారానికి తప్పదు భారీ మూల్యం

2019 Telugu Full Movies, Telangana Minister Talasani Srinivas Yadav Files Defamation Case Against False Allegations, Files Defamation Filed By Telangana Minister Talasani Srinivas Yadav, Talasani Srinivas Yadav Defamation Case, False Allegations by Telangana Minister Talasani Srinivas Yadav, Telugu Film updates, Telugu Filmnagar, Tollywood cinema News

మీడియాలో రాను రాను తప్పుడు ప్రచారాలు, వక్రభాష్యాల జోరు పెరిగిపోతుంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా  కల్పనలు, కట్టుకథలతో వాస్తవాలను వక్రీకరించే వక్ర బుద్ధి మీడియాలో ఎక్కువైంది. అందుకు బోనాల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన బోనాల సంప్రదాయ నృత్యానికి  గబ్బర్ సింగ్ సినిమాలోని ” మందు బాబులం” అనే పాటను మార్ఫింగ్ చేసి పబ్లిష్ చేయటాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బోనాల ఉత్సవాల్లో అధికారిక హోదా ల్లోనూ, వ్యక్తిగతంగానూ కూడా పాల్గొనవలసి రావటం తెలంగాణలోని రాజకీయ ప్రముఖులకు తప్పనిసరి. అది ఇక్కడి సంప్రదాయంలో భాగం. ఆ సందర్భంగా బోనాల సంప్రదాయ వాయిద్యాలకు అనుగుణంగా డాన్స్ చేయమని స్థానిక ప్రజలు ఒత్తిడి పెట్టడం, ప్రముఖులు ఎవరైనా ఆ సంబరాల్లో కాలు కదపటం ఆనవాయితీ.

ముఖ్యంగా జంటనగరాల ప్రజలతో విశేషమైన అనుబంధమున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఇది ఒక తప్పనిసరి ఫార్మాలిటీ. అంతేకాకుండా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలలో భాగమైన బోనాల వేడుకల్లో చిందేయటం వారి సంప్రదాయాలనుగౌరవించడంవంటిదే. అయితే అత్యుత్సాహం, అతి పోకడలు ఎక్కువైన కొన్ని సోషల్ మీడియా సంస్థలు తలసాని చేసిన సంప్రదాయ బోనాల నృత్యానికి
” మందు బాబులం మేము మందు బాబులం” అనే గబ్బర్ సింగ్ సినిమాలోని పాట ఆడియోను మిక్స్ చేసి తమ యూట్యూబ్ ఛానల్స్ లో అప్లోడ్ చేయడంతో అవి బాగా వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు చూసిన కొందరు నెటిజన్లు తలసాని పై నెగిటివ్ కామెంట్స్ పోస్ట్ చేశారు. నిజానికి తలసానికి మందు, సిగరెట్ వంటి దూరలవాట్లు లేవు.

కాగా సోషల్ మీడియాలోని ఒక వర్గం  చేసిన ఈ చెత్త పోస్టింగ్ ల గురించి రెగ్యులర్ మీడియా ప్రశ్నించగా తలసానికి చిర్రెత్తుకొచ్చింది.అయినా తమాయించుకుని ” నేను డాన్స్  చేసిన సందర్భం ఏమిటి? దానికి వాళ్ళు చేసిన వక్రభాష్యం ఏమిటి? నేను చేసిన సంప్రదాయ పరమైన పనికి ఇలాంటి మార్ఫింగ్ తో తప్పుడు ప్రచారం చేస్తున్నవారి మీద సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేశాను. వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు” అని సమాధానం ఇచ్చారు.

అయినా సమయం సందర్భం లేకుండా ఒక ప్రాంతపు సంప్రదాయ కార్యక్రమంలో పాలుపంచుకున్న మంత్రి మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసినందుకు సదరు తప్పుడు మీడియా సంస్థలు చెల్లించక తప్పదు భారీ మూల్యం.

[subscribe]

[youtube_video videoid=sEhSFlIwavI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + ten =