నా కోరిక చిరంజీవి గారి స్థాయికి ఎదగాలి

2019 Latest Telugu Film News, RX 100 Fame Kartikeya About Megastar Chiranjeevi, Kartikeya About Megastar Chiranjeevi, Kartikeya Latest Movie News, Kartikeya Comments Megastar Chiranjeevi, Kartikeya Interesting Words on Megastar Chiranjeevi, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘గుణ 369’. ఆగష్ట్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బీజీగా వుంది చిత్ర బృందం.. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, టైలర్ ను రిలీజ్ చేయగా.. ఒక్కోక్కటిగా పాటలను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కార్తికేయ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా లో నేను జైలు కి వెళతాను అక్కడ నా నెంబర్ 369 నా పేరు గుణ అదే గుణ 369… ఒంగోలులో ఓ మధ్య తరగతికి చెందిన కుర్రాడి కథ ఇది. మంచి కుటుంబం, ప్రియురాలితో సంతోషంగా ఉంటాడు. అలాంటి మధ్య తరగతి కుర్రాడు ఎందుకు తిరగబడ్డాడు? దానికి కారణం ఏంటి? అన్నదే స్టోరీ అని తెలిపాడు. ఇంకా మాట్లాడుతూ మూడు సినిమాల హీరోగా మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు? అన్న ప్రశ్నకు నా ప్రతి చిత్రంతోనూ నటుడిగా ఎదగాలని భావిస్తాను.. నా ఆఖరి కోరిక మాత్రం చిరంజీవిగారి స్థాయిని చేరుకోవడమే. స్కై ఈజ్‌ ది లిమిట్‌ అని అనుకుంటే.. నా దృష్టిలో ఆ స్కై చిరంజీవిగారే. మరి ఇప్పుడున్న కాంపిటీషన్ కి చిరంజీవి గారి స్థాయికి చేరుకోవడం అంటే కష్టమైన పనే.. కానీ అంత స్థాయికి ఎదగాలని కోరుకుందాం..

కాగా ఈసినిమాలో కార్తికేయ పక్కన మలయాళ బ్యూటీ అనఘ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రతినాయకుడిగా ఆదిత్య మీనన్ నటిస్తుండగా, ఒక కీలకమైన పాత్రను మంజుభార్గవి పోషిస్తోంది. స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను అనిల్ కడియాల, తిరుమల రెడ్డి నిర్మిస్తున్నారు. RX 100 వంటి బ్లాక్ బస్టర్ మూవీ కి సంగీతం అందించిన చైతన్ భరద్వాజే ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరి లవ్ .. యాక్షన్ .. ఎమోషన్  .. కామెడీ ఇలా నాలుగు అంశాలతో మరో డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు కార్తికేయ. ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=yVCzt0mxxAk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − one =