`జెర్సీ` వంటి విజయవంతమైన చిత్రం తరువాత నేచురల్ స్టార్ నాని నుంచి వస్తున్న సినిమా `గ్యాంగ్ లీడర్`. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని తొలుత ఆగస్టు 30న విడుదల చేయాలనుకున్నారు. అయితే, అదే రోజున యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీ `సాహో` విడుదల కానుండడంతో… సెప్టెంబర్ ప్రథమార్ధానికి ఈ సినిమాని వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం… సెప్టెంబర్ 13న `గ్యాంగ్ లీడర్` రిలీజ్ కావచ్చని వినిపిస్తోంది. గతంలో సెప్టెంబర్ ఫస్టాఫ్‌లో వచ్చిన నాని చిత్రాలు `అష్టాచమ్మా` (2008), `భలే భలే మగాడివోయ్` (2015) మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో… `గ్యాంగ్ లీడర్` కూడా ఆ సెంటిమెంట్‌ని రిపీట్ చేసి బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తుందేమో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: