నా సొంత బ్యానర్లోనే తరువాత సినిమా..

2019 Latest Telugu Movie News, Kartikeya to act in his own banner, Rx 100 Kartikeya to Do A Movie On His Own Banner, Kartikeya Upcoming Movie In His Production, Kartikeya Gummakonda To Do In his Banner Next, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Kartikeya to Act in his Own Banner

ఆర్ఎక్స్ 100 సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ.. ఇటీవలే హిప్పీ తో ప్రేక్షకులను అలరించాడు. అయితే హిప్పీ నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు ‘గుణ 369′ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ లో పాల్గొన్న కార్తికేయ తన కొత్త సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా తరువాత నేను గీతా ఆర్ట్స్ లో చేయనున్నాననే ప్రచారం జరుగుతోంది. ఒక వేదికపై నాకు .. అల్లు అరవింద్ గారికి జరిగిన సంభాషణ కారణంగా అలా అనుకుంటున్నారు .. కానీ అలాంటిదేమీ లేదు.’గుణ 369’ తరువాత నేను చేయనున్న సినిమా ఆల్రెడీ మొదలైపోయింది. శేఖర్ విఖ్యాత్ అనే దర్శకుడితో నా సొంత బ్యానర్లోనే ఈ సినిమా చేస్తున్నాను. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరిగింది. ఈ ఏడాది చివరిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నాము. ‘శ్రీ’ అనే మరో కొత్త దర్శకుడి ప్రాజెక్టును కూడా చేసే అవకాశం వుంది” అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి యంగ్ హీరోలు ఈ మధ్య ఎవరి ప్రొడక్షన్ వాళ్ళు సొంతగా పెట్టుకుంటున్నారు. వాళ్ల సినిమాలు వాళ్ళే తీసుకుంటున్నారు.

[subscribe]

[youtube_video videoid=yVCzt0mxxAk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.