
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 23

మన్మథుడు 2 హిట్ కొడతా - చైసామ్ కి షాక్ ఇస్తా
మరోసారి తారక రాముడి సమేతంగా త్రివిక్రముడు?

వాల్మీకి సెట్ లో ఆస్కార్ విన్నర్

ఆర్.ఎఫ్.సి.లో ‘వెంకీమామ’ సందడి
నెక్స్ట్ టార్గెట్ నితిన్

జోడి రిలీజ్ డేట్ ఖరారు

ఎన్నో యేళ్ల తరువాత మహేష్ సినిమాలో బండ్ల
సాహో నుండి అదిరిపోయే విలన్ లుక్

నిశ్శబ్ధం మూవీ షూటింగ్ పూర్తి
ఇద్దరు హీరోలు గట్టెక్కినట్టే..!

ఎవరు మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్

జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీ

`ప్రతీ రోజు పండగే`కి `సిరివెన్నెల` గీతం

8 మిలియన్ ట్విట్టర్ ఫాలోయర్స్

`గ్యాంగ్ లీడర్` షూటింగ్ పూర్తి

`అ!` దర్శకుడితో అఖిల్ చిత్రం?

మహేష్ పుట్టినరోజు నుంచి విజయశాంతి సందడి
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి... ఒకవైపు కమర్షియల్ హీరోయిన్‌గా మురిపిస్తూనే, మరోవైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌తోనూ సంచలనం సృష్టించిన నిన్నటి తరం అగ్రశ్రేణి కథానాయిక. ఇదిలా ఉంటే... సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఈ టాలెంటెడ్ స్టార్ రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
మన్మథుడు 2 హిట్ కొడతా - చైసామ్ కి షాక్ ఇస్తా
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీ బిజీ గా వుంది చిత్ర యూనిట్. ఇక ఈ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నాగార్జున పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
మరోసారి తారక రాముడి సమేతంగా త్రివిక్రముడు?
యంగ్ టైగర్ యన్టీఆర్‌ని కొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రాలలో `అరవింద సమేత వీర రాఘవ` ఒకటి. గత ఏడాది విజయదశమి కానుకగా విడుదలైన ఈ సినిమాకి ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించిన ఈ క్రేజీ కాంబినేషన్‌లో మరో చిత్రం రానుందని సమాచారం.

వాల్మీకి సెట్ లో ఆస్కార్ విన్నర్
హరీష్ శంకర్ దర్శకత్యంలో వాల్మీకి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమాను మొదట సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ చేశారు. అయితే మళ్లీ రిలీజ్ డేట్ ను మార్చారు. సెప్టెంబర్ 13వ తేదీన సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఆర్.ఎఫ్.సి.లో ‘వెంకీమామ’ సందడి
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. నిజజీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన వెంకీ, చైతూ... ఇందులోనూ అవే పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు.
నెక్స్ట్ టార్గెట్ నితిన్
ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు.. మొత్తానికి అటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి.. ఇటు డైరెక్టర్ రమేష్ వర్మ ఇద్దరికీ హిట్ దక్కింది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ఆరంభం నుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక రమేష్ వర్మకు కూడా రవితేజతో చేసిన వీర, నాగశౌర్యతో చేసిన అమ్మాయితో అబ్బాయి చిత్రాలు ఫ్లాప్స్ అయ్యాయి. దీనితో ఇద్దరికి రాక్షసుడు చిత్రంతో హిట్ దక్కింది.

జోడి రిలీజ్ డేట్ ఖరారు
ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ కాంబినేషన్లో 'జోడి' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేసుకున్న జోడీ త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ లుక్, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
నా రాజీనామా ఉపసంహరణ వార్త నిజం కాదు - చదలవాడ శ్రీనివాసరావు
“ శ్రీనివాస రావు గారు! నమస్తే"... “ నమస్తే - చెప్పండి” “మీరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ట్రెజరర్ పదవికి రాజీనామా చేశారు కదా"! " అవును.. చేసాను". " మరి మీరు మీ రాజీనామాను ఉపసంహరించుకున్నారు అనే వార్త ఒకటి వినిపిస్తోంది.. నిజమేనా? అసలు మీ రాజీనామాకు దారితీసిన పరిస్థితులు ఏమిటో వివరిస్తారా?"

ఎన్నో యేళ్ల తరువాత మహేష్ సినిమాలో బండ్ల
చాలా గ్యాప్ తీసుకున్న తరువాత మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు బండ్ల గణేష్. గతంలో పలు సినిమాల్లో కామెడియన్ గా చేసిన బండ్ల ఆ తర్వాత నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తీసాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి మళ్ళీ తనకు రాజకీయాలు సెట్ కావని బయటకు వచ్చేశాడు. మళ్ళీ మరోసారి ఎంట్రీ ఇవ్వనున్నాడు.
సాహో నుండి అదిరిపోయే విలన్ లుక్
ఇప్పటికే పాటలు, పోస్టర్లతో సాహో చిత్ర యూనిట్ రోజుకో సర్ ప్రయిజ్ ఇస్తుంది ఫ్యాన్స్ కి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎక్కడిక్కడ షెడ్యూల్స్ ను ఫిక్స్ చేసుకోనున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నేషనల్ వైడ్ గా టూర్ వేసే ప్లాన్ లో ఉన్నారు. అంతే కాదు ‘సాహో ది గేమ్’ పేరుతో ఓ వీడియో గేమ్ ని కూడా విడుదల చేయనున్నారు.

నిశ్శబ్ధం మూవీ షూటింగ్ పూర్తి
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై స్టార్ హీరోయిన్ అనుష్క, తమిళ హీరో మాధవన్ జంటగా, అంజలి, షాలిని పాండే మైకేల్ మ్యాడ్సెన్ , శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు ముఖ్య పాత్రలలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ నిశ్శబ్ధం మూవీ నవంబర్ 16 వతేదీ రిలీజ్ కానుంది. గోపిసుందర్ సంగీతం అందించారు.
ఇద్దరు హీరోలు గట్టెక్కినట్టే..!
మొత్తానికి ఇద్దరు హీరోలకి కాస్త రిలీఫ్ దొరికింది. ఇంతకీ ఆ హీరోలు ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కార్తికేయ. ఎందుకంటే అటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కీ, ఇటు కార్తికేయకూ ఈ సినిమా ఫలితాలు చాలా కీలకం. వాళ్ల భవిష్యత్తుని నిర్ణయించేవి ఈ చిత్రాలే. ఈ రెండు సినిమాలు అటో ఇటో ఐతే వారి కెరీర్ కే పెద్ద ప్రాబ్లెమ్ వచ్చి పడేది. ఈ గండం గట్టక్కాలంటే… తప్పకుండా ఈ సినిమాతో హిట్టు కొట్టాల్సిందే.

ఎవరు మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
పివిపి సినిమా బ్యానర్ పై నూతన దర్శకుడు వెంకట్ రామ్ జీ దర్శకత్వం లో సక్సెస్ ఫుల్ యాక్టర్ , రైటర్ అడివి శేష్ ; రెజీనా జంటగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ఎవరు మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కానుంది. నవీన్ చంద్ర, మురళీ శర్మ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. బొమ్మరిల్లు, అతిథి , కిక్, Mr పర్ ఫెక్ట్, ఎవడు, క్షణం, ఊపిరి, గూఢచారి వంటి సూపర్ హిట్ మూవీస్ కు డైలాగ్ రైటర్ గా పనిచేసిన అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు.

'ఏ చోట నువ్వున్నా' ఫుల్ సాంగ్ రిలీజ్
సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో 'సాహో' సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంకా నెలరోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అప్పుడే మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి టీజర్ ను.. సయ్యా సైకో అనే పాటను రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో పాటను విడుదల చేశారు. తాజాగా 'ఏ చోట నువ్వున్నా' సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ నాలుగు వర్షెన్స్ కు గురు రంధవా మ్యూజిక్ అందించాడు.
హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్
సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ సరిలేరు నీకెవ్వరు కాశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో రూపొందించిన రైలు సెట్ లో షూటింగ్ జరుగుతుంది. 35 నిమిషాల పాటు ఉండే ఈ ట్రైన్ ఎపిసోడ్ సరిలేరు నీకెవ్వరు మూవీ కి వన్ ఆఫ్ ది హై లైట్ అని, ఈ ఎపిసోడ్ ను చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని అంత హిలేరియస్ గా ఉందని సమాచారం.

జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీ
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, దివంగత లెజండరీ యాక్ట్రెస్ శ్రీదేవి గారాల తనయ జాన్వీ కపూర్, శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో రూపొందిన ధడక్ మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. బ్లాక్ బస్టర్ సైరత్ మరాఠీ మూవీ రీమేక్ ధడక్ మూవీ ఘనవిజయం సాధించి 100కోట్ల క్లబ్ లో చేరింది. కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందనున్న మల్టీ స్టారర్ తఖ్త్ , సూపర్ హిట్ మూవీ దోస్తానా సీక్వెల్ దోస్తానా 2, కార్గిల్ వార్ లో ఫస్ట్ ఉమెన్ వారియర్ గుంజన్ సక్సేనా బయోపిక్ మూవీ కి జాన్వీ కమిట్ అయ్యారు.

`ప్రతీ రోజు పండగే`కి `సిరివెన్నెల` గీతం
`చిత్రలహరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత మెగా హీరో సాయితేజ్ నటిస్తున్న సినిమా `ప్రతీ రోజు పండగే`. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సత్యరాజ్ ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం... ప్రస్తుతం మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే... థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా కోసం... ప్రముఖ గీత రచయిత `సిరివెన్నెల` సీతారామశాస్త్రి ఓ సందర్భోచిత పాటని రాశారని సమాచారం.

8 మిలియన్ ట్విట్టర్ ఫాలోయర్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. 2010 సంవత్సరం లో ట్విట్టర్ లో జాయిన్ అయిన మహేష్ బాబు 8 మిలియన్స్ ట్విట్టర్ ఫాలోయర్స్ తో రికార్డ్ క్రియేట్ చేశారు. ట్విట్టర్ లో మహేష్ బాబు తన అభిమానులతో టచ్ లో ఉంటారు. తాను నటించే మూవీ అప్ డేట్స్, తన ఫ్యామిలీ గురించి, ఇతర ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్ గురించి, ఇతర మూవీస్ మినీ రివ్యూస్, ఈవెంట్స్, తన బిజినెస్ వెంచర్స్ వంటి విషయాలను అభిమానులకు ట్విట్టర్ ద్వారా మహేష్ బాబు షేర్ చేస్తారు.

`గ్యాంగ్ లీడర్` షూటింగ్ పూర్తి
అతనో రివెంజ్ రైటర్. పేరు... `పెన్సిల్` పార్థసారథి. పెన్సిల్ అతని కలం పేరు. ఓ రోజు అతని దగ్గరకి వేర్వేరు ఏజ్‌గ్రూప్‌లకి చెందిన ఐదుగురు మహిళల గ్యాంగ్ వస్తుంది. వారికో ఓ రివెంజ్ స్టోరీ ఉంటుంది. మరి... ఆ రివెంజర్స్‌కు పెన్సిల్ ఎలా సహాయపడ్డాడు? ఈ నేపథ్యంలో ఆ ఆరుగురికి ఎదురైన పరిణామాలేంటి? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం `గ్యాంగ్ లీడర్`. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన 24వ సినిమా ఇది. `24` ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా తాజాగా చిత్రీకరణను పూర్తిచేసుకుందని సమాచారం. ప్రస్తుతం…

`అ!` దర్శకుడితో అఖిల్ చిత్రం?
ప్రయోగాత్మక చిత్రం `అ!`తో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇటీవల `కల్కి`తో మరోసారి ఇంప్రెస్ చేసిన ప్రశాంత్... త్వరలో తన తొలి చిత్ర కథానాయిక కాజల్ అగర్వాల్‌తో మరో ఎక్స్‌పెరిమెంటల్ మూవీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అంతేకాదు... అక్కినేని వారి యువ కథానాయకుడు అఖిల్‌తోనూ ఓ ప్రేమకథా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్.