సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ సరిలేరు నీకెవ్వరు కాశ్మీర్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో రూపొందించిన రైలు సెట్ లో షూటింగ్ జరుగుతుంది. 35 నిమిషాల పాటు ఉండే ఈ ట్రైన్ ఎపిసోడ్ సరిలేరు నీకెవ్వరు మూవీ కి వన్ ఆఫ్ ది హై లైట్ అని, ఈ ఎపిసోడ్ ను చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని అంత హిలేరియస్ గా ఉందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఖలేజా, దూకుడు మూవీస్ లో మహేష్ బాబు తన కామెడీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు మూవీ లో తన కామిక్ రోల్ తో ఆ మూవీస్ లో కంటే ఎక్కువగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనున్నారు. సంక్రాంతి పండుగ కు రిలీజ్ కానున్న సరిలేరు నీకెవ్వరు మూవీని కామెడీ సీన్స్, డైలాగ్స్ తో పండుగ మూడ్ కు సూట్ అయ్యేలా దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన F 2 మూవీ ప్రేక్షకులను విశేషంగా అలరించిన విషయం తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: