కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 22

సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న 'రణరంగం'

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రణరంగం. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15 న విడుదలకానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా వుంది చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. చిత్రానికి 'యు/ఎ' సర్టిఫికెట్ లభించింది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

సాహో నుండి మరో విలన్ ఫస్ట్ లుక్ రిలీజ్

టీమ్ సాహూ రోజుకో సర్ప్రైజ్ ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పోస్టర్లు, పాటలు రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ సినిమాలో నటించిన విలన్ ఫస్ట్ లుక్స్ ను రోజుకొకటి రిలీజ్ చేస్తూ సందడి చేస్తున్నారు. మొన్న మెయిన్ విలన్ నీల్ నితిన్ ముఖేష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా నిన్న చుంకీ పాండే, అరుణ్ విజయ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ రోజు మరో విలన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మలయాళం సినిమాల్లో విలన్ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన లాల్ ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. ఇబ్రహిం గా ఈ సినిమాలో కనిపించనున్నాడు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Bigg Boss Contestant Ravi Krishna hats off to your patience, Tamanna bullies Ravi Krishna in Bigg Boss Telugu 3, Bigg Boss Contestant Ravi Krishna, Bigg Boss Contestant Ravi Krishna Latest News, Bigg Boss Telugu 3 Latest
సినిమా వార్తలు

నీ సహనానికి హ్యాట్సాఫ్ రవి

బాబోయ్ తమన్నా..! ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్ రియాక్షన్ ఇదే. బిగ్ బాస్ సీజన్ 3 లో వైల్డ్ కార్డు ఎంట్రీ తో హౌస్ లోకి అడుగుపెట్టిన తమన్నా.. నిజంగా ఆడియన్స్ సహనానికి ఓ పరీక్ష పెడుతుందని చెప్పొచ్చు. కేవలం ఆడియన్స్ కే కాదు.. హౌస్ లో వున్నా మిగతా కంటెస్టెంట్స్ కి కూడా ఇది అగ్ని పరీక్షే. ఎందుకంటే తన నోటికి హద్దు లేకుండా మాట్లాడమే దీనికి కారణం.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Team Saaho Releases Chunky Pandey Look, Chunky Striking Look In Saaho, Chunky Pandey Look From Team Saaho, Chunky Pandey Latest Movie News, Chunky Pandey Look From Saaho, Saaho Movie Latest News, Chunky Pandey look will
ఫస్ట్ లుక్

సాహో మూవీ లో దుష్టచూపుల దేవరాజ్

సుజీత్ దర్శకత్వం లో తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30వ తేదీ రిలీజ్ సందర్భంగా సాహో మూవీ కి సంబంధించిన విశేషాలతో ప్రేక్షకులను చిత్ర యూనిట్ సర్ ప్రైజ్ చేస్తుంది. రీసెంట్ గా ప్రభాస్, శ్రద్ధా కపూర్ లపై చిత్రీకరించిన రెండు సాంగ్స్ ను రిలీజ్ చేయగా ఆ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. త్వరలోనే ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'మిస్ ఇండియా'గా కీర్తి సురేష్?

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. న‌రేంద్ర అనే డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం కాబోతున్నాడు. మ‌హేష్ కొనేరు నిర్మిస్తున్నాడు. మ‌హిళ‌ల‌పై జ‌రిగే అకృత్యాల నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. గతకొద్ధి కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని స‌మాచారం.

TFN Adminవాట్సాప్
స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుని లాంచ్ చేయనున్న రాహుల్?
సినిమా వార్తలు

స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుని లాంచ్ చేయనున్న రాహుల్?

హీరోగా సినీపరిశ్రమలో అడుగుపెట్టి ఇప్పుడు డైరెక్టర్ గా బిజీ అయ్యాడు రాహుల్ రవీంద్రన్. చి.ల.సౌ తో తొలి సినిమాకు దర్శకత్వం వహించి మొదటి సినిమాకే మంచి మార్కులు కొట్టేసాడు. మళ్ళీ అదే అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున ప్రధానపాత్రలో మన్మథుడు 2 సినిమా చేసేసాడు. ఈ సినిమా ఈ నెల 9వ తేదీన రిలీజ్ కానుంది. అన్నీ కుదిరితే నాగచైతన్య తో కూడా సినిమా తీసే అవకాశం వుంది. అయితే ప్రస్తుతం చైతన్య ఖాళీ లేడు. వెంకీ మామ తరువాత శేఖర్ కమ్ముల సినిమా చేయాల్సివుంది. అలాగే అన్నీ కుదిరితే మేర్లపాక గాంధీ డైరక్షన్ లో ఓ సినిమా చేయాల్సి వుంది. అలాగే దిల్ రాజుకు ఓ సినిమా చేయాల్సివుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్‌ పర్చా శరత్‌కుమార్‌ మృతి

నాలుగు దశాబ్దాలుగా ఫిలిం జర్నలిస్ట్‌గా పలు సంస్థల్లో పనిచేసి సినిమా రంగానికి విశేష సేవలందించిన ప్రముఖ జర్నలిస్ట్‌ పర్చా శరత్‌కుమార్‌(74)గారు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం 11.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. హెచ్‌ఎంటి నగర్‌లోని ఆయన నివాసంలో భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచారు. పర్చా శరత్‌కుమార్‌ మృతి పట్ల ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. హెచ్‌ఎంటిలో ఉద్యోగం చేస్తూ హాబీగా సినిమా వార్తలు, సమీక్షలు, సినిమా వారితో ఇంటర్వ్యూలు చేసేవారు. పాతతరం సినీ పెద్దలందరితో చనువుగా మెలిగేవారు. వివిధ…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, RX 100 Hindi Remake Kicks Off Shooting, Ahan Shetty kick starts Shooting For Hindi remake of RX100, RX 100 Hindi Remake Latest News, Ahan Shetty Starrer RX100 Hindi Remake, Ahan Shetty Begins Debut Film RX 100 Hindi Rema
సినిమా వార్తలు

RX 100 మూవీ బాలీవుడ్ రీమేక్ ప్రారంభం

దక్షిణాది మూవీస్ బాలీవుడ్ లో రీమేక్ అయి ఘనవిజయం సాధిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సందీప్ రెడ్డి దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ అర్జునరెడ్డి మూవీ కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ చేయగా ఘనవిజయం సాధించించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా రూపొందిన RX 100 మూవీ సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పుడు RX 100 మూవీ హిందీ లో రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరోలు చేస్తే కరెక్ట్ - మేము చేస్తే తప్పా?

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మన్మథుడు 2’. ఆగష్ట్ 9వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా పాల్గొంటుంది చిత్ర యూనిట్. దీనిలో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నాలుగు పాటలు, సీన్లు ఉన్న పాత్ర కంటే.. నటనకు ఆస్కారం ఉన్న విభిన్నమైన పాత్రలో నటించడానికే ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. అంతే కాదు.. ఈ సినిమాలో తాను స్మోకింగ్ చేయడంపై కూడా స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Ninnu Kori Tamil Remake Confirmed,Telugu blockbuster Ninnu Kori to get a Tamil Remake, Ninnu Kori Tamil Remake Fixed, Atharvaa and Anupama come together for the Tamil remake Ninnu Kori, Ninnu Kori Film to Get a Tamil Rem
సినిమా వార్తలు

బ్లాక్ బస్టర్ నిన్నుకోరి మూవీ తమిళ రీమేక్

శివ నిర్వాణ దర్శకత్వంలో హీరో నాని, నివేత థామస్ జంటగా, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలో నటించిన నిన్నుకోరి మూవీ 2017 సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఆ మూవీ తమిళ భాషలో రీమేక్ కానుంది. నిన్నుకోరి మూవీ తమిళ రీమేక్ రైట్స్ ను కాస్మో కిరణ్ సొంతం చేసుకున్నారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది .

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, King Nagarjuna Manmadhudu 2 Run Time Details, King Nagarjuna Manmadhudu 2 Run Time Out, Manmadhudu 2 Run Time Locked, Manmadhudu 2 Run Time Locked Announced, Manmadhudu 2 Run Time Locked Fixed, Telugu Film Updates, Telug
సినిమా వార్తలు

‘మన్మథుడు 2’... ర‌న్ టైమ్ డిటైల్స్‌

కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో... ‘వెన్నెల’ కిషోర్, లక్ష్మి, రావు ర‌మేష్‌, ఝాన్సీ ఇత‌ర‌ ముఖ్య భూమికలను పోషించారు. సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ అతిథి పాత్ర‌ల‌లో దర్శనమివ్వనున్నారు. ‘మన్మథుడు’కి మ‌రో వెర్ష‌న్‌గా వస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ చైతన్ భరద్వాజ్ బాణీలు అందించాడు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Kabir Singh to Stand Out in Top 10 Movies in Bollywood, Shahid Kapoor's Kabir Singh becomes seventh Bollywood venture,Top 10 Movies in Bollywood, Kabir Singh Movie Latest News, Kabir Singh in Top 10 BollyWood Movies, Kab
సినిమా వార్తలు

2019 బాలీవుడ్ టాప్ 10లో నంబ‌ర్ వ‌న్ మూవీగా ‘కబీర్ సింగ్’

షాహిద్ కపూర్, కియారా అద్వాని జంటగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ చిత్రం ‘కబీర్ సింగ్’. తెలుగునాట సంచ‌ల‌న విజ‌యం సాధించిన ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్ వెర్ష‌న్‌గా రూపొందిన ‘కబీర్ సింగ్’... బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా వ‌సూళ్ళ కుంభ‌వృష్టి కురిపించింది. అంతేకాదు... మొద‌టి ఆట నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్... 2019కి గానూ (తొలి 7 నెలల్లో) బాలీవుడ్ టాప్ 10 గ్రాసర్స్‌లో తొలి స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇక ‘కబీర్ సింగ్’ తరువాత స్థానాల‌లో ‘ఉరి’, ‘భారత్’, ‘కేసరి’, ‘టోటల్ ఢ‌మాల్’, ‘సూపర్ 30’, ‘గల్లీబాయ్’, ‘దే దే ప్యార్ దే’, ‘మణికర్ణిక’, ‘లుకా చుప్పి’ నిలిచాయి…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శ‌ర‌వేగంగా ‘ఎంత మంచి వాడవురా’ చిత్రీక‌ర‌ణ‌

నందమూరి కళ్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా సతీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ చిత్రం ‘ఎంత మంచి వాడవురా’. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి గోపిసుందర్ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ బాబు ‘శ్రీమంతుడు’కు 4 ఏళ్ళు

సూపర్ స్టార్ మహేష్ బాబుకి అచ్చొచ్చిన ద‌ర్శ‌కుల్లో కొరటాల శివ ఒక‌రు. అలాంటి ఈ ఇద్ద‌రి తొలి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘శ్రీమంతుడు’. “శ్రీమంతులు బాగా వెనకబడిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం” అనే సామాజిక అంశంతో తెర‌కెక్కిన ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీగా నిల‌చింది. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో... జగపతిబాబు, సుకన్య, రాజేంద్ర ప్రసాద్, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ఏడిద శ్రీరామ్, తులసి, సితార, ముఖేష్ రిషి, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Disco Raja Shooting Started In Delhi, Disco Raja to be shot in Delhi, Shooting of Ravi Teja Disco Raja In Delhi, Ravi Teja Disco Raja Movie Latest News, Latest update on Ravi Teja Disco Raja, Telugu Film Updates, Telugu
సినిమా వార్తలు

ఢిల్లీలో ‘డిస్కో రాజా’ సంద‌డి

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్‌ నాయికలుగా నటిస్తుండ‌గా... సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Team Saaho Thanks All Producers, Team Saaho Pens A Letter To All Producers, Saaho Movie Latest News, Producers Recived Thanks Letter From Saaho Team,Prabhas and Saaho team thank 4 directors for changing release, Prabhas
సినిమా వార్తలు

థ్యాంక్స్ .. .. సాహో మూవీ టీమ్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా, భారీ బడ్జెట్, భారీ తారాగణం తో సుజీత్ దర్శకత్వంలో రూపొందిన సాహో మూవీ ప్రపంచవ్యాప్తం గా ఆగస్ట్ 30 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజ్ కానున్న సాహో మూవీ గురించి కొన్ని మూవీస్ రిలీజ్ డేట్స్ రీషెడ్యూల్ అయ్యాయి. ఈ సందర్భంగా సాహో మూవీ టీమ్ ఆయా నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేసింది.

Team TFNవాట్సాప్
Junior NTR Seals His Next Project,2019 Latest Telugu Film News, Jr NTR and Trivikram New Movie From 2020 Summer, Trivikram New Movie From 2020, Jr NTR and Trivikram To Start Shooting From Summer, Jr NTR locks his director for next project From Summer
సినిమా వార్తలు

నందమూరి అభిమానులకు శుభవార్త ?

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో తారాపథం లో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ RRR మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. 2020 సంవత్సరం మార్చి నెలలో RRR మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది. ఆ మూవీ తరువాత తాను నటించే మూవీస్ కు ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Rebel Star Prabhas to marry after Saaho Movie release, Prabhas getting married after Saaho release, Prabhas to get married after Saaho, Prabhas marriage updates, Prabhas Marrage Latest Updates, Saaho Movie release, Prabh
సినిమా వార్తలు

సాహో రిలీజ్ తరువాత ప్రభాస్ మ్యారేజ్ ?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా, భారీ బడ్జెట్, భారీ తారాగణం తో సుజీత్ దర్శకత్వంలో రూపొందిన సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన సాహో మూవీ గురించి, అతని మ్యారేజ్ గురించి ప్రభాస్ అభిమానులు చాలా కాలం గాఎదురు చూస్తున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Manchu Manoj Finishes 15 Years in Tollywood as Hero, Manchu Manoj Completed 15 Years in Tollywood, Manchu Manoj Latest Movie News, 15 Years For Manchu Manoj TFC, Manchu Manoj Upcoming Movie updates, Manchu Manoj Successf
సినిమా వార్తలు

క‌థానాయ‌కుడిగా 15 ఏళ్ళ కెరీర్‌ను పూర్తి చేసుకున్న మంచు మనోజ్

క‌లెక్ష‌న్ కింగ్‌ డా.ఎం.మోహన్‌బాబు నట వారసుడిగా తెలుగు తెరకు క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు మంచు మనోజ్ కుమార్. బాల‌న‌టుడిగా `మేజ‌ర్ చంద్ర‌కాంత్‌`, `అడ‌విలో అన్న‌` వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ త‌న‌యుడిగా గుర్తింపు తెచ్చుకున్న మనోజ్... అనంత‌రం క‌థానాయ‌కుడిగానూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్... ఇలా జానర్ ఏదైనా తనదైన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ఈ మంచు వారబ్బాయి... ఇప్పటి వరకు 17 సినిమాల్లో హీరోగా న‌టించాడు. వీటిలో `నేను మీకు తెలుసా?`, `ప్ర‌యాణం`, `బిందాస్‌`, `వేదం`, `ఝుమ్మంది నాదం` వంటి చిత్రాలు మంచి గుర్తింపును తీసుకువ‌చ్చాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, JD Chakravarthy Premaku Velayera Finishes 20 Years, 20 Years For JD Chakravarthy Premaku Velayera, Premaku Velayera Completed 20 Years, 20 Glorified Years For Premaku Velayera, Premaku Velayera Telugu Movie, JD Chakravar
సినిమా వార్తలు

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ప్రేమకు వేళాయెరా’కు 20 ఏళ్ళు

కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ వినోదాత్మ‌క చిత్రాల‌ను రూపొందించ‌డంలో ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీరే వేరు. అలా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెర‌కెక్కించిన‌ చిత్రాలలో ‘ప్రేమకు వేళాయెరా’ ఒకటి. జె.డి.చక్రవర్తి, సౌందర్య తొలిసారి జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో... రవితేజ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, శ్రీహరి, సూర్య‌, రంగనాథ్, బాబూమోహన్, అన్నపూర్ణ, వై.విజయ తదితరులు ఇతర ముఖ్య‌ భూమికలను పోషించారు. అందాల తార‌ రమ్యకృష్ణ ఓ ప్ర‌త్యేక గీతంలో నర్తించింది.

Team TFNవాట్సాప్

షేర్