`చిత్రలహరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత మెగా హీరో సాయితేజ్ నటిస్తున్న సినిమా `ప్రతీ రోజు పండగే`. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సత్యరాజ్ ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం… ప్రస్తుతం మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే… థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా కోసం… ప్రముఖ గీత రచయిత `సిరివెన్నెల` సీతారామశాస్త్రి ఓ సందర్భోచిత పాటని రాశారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్రంలో కీలక సందర్భంలో వచ్చే ఫ్యామిలీ సాంగ్ ఇదని… కుటుంబ విలువలతో కూడిన ఈ గీతానికి సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యమందించారని సమాచారం. అంతేకాదు… సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే గీతమిదని టాక్. కాగా… 2020 సంక్రాంతికి `ప్రతీ రోజు పండగే` విడుదల కానుంది.
[youtube_video videoid=UNQYmBKcjHs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























