ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, దివంగత లెజండరీ యాక్ట్రెస్ శ్రీదేవి గారాల తనయ జాన్వీ కపూర్, శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో రూపొందిన ధడక్ మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశించారు. బ్లాక్ బస్టర్ సైరత్ మరాఠీ మూవీ రీమేక్ ధడక్ మూవీ ఘనవిజయం సాధించి 100కోట్ల క్లబ్ లో చేరింది. కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందనున్న మల్టీ స్టారర్ తఖ్త్ , సూపర్ హిట్ మూవీ దోస్తానా సీక్వెల్ దోస్తానా 2, కార్గిల్ వార్ లో ఫస్ట్ ఉమెన్ వారియర్ గుంజన్ సక్సేనా బయోపిక్ మూవీ కి జాన్వీ కమిట్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ సూపర్ స్టార్ తల అజిత్ 60 వ మూవీ తో జాన్వీ కపూర్ కోలీవుడ్ కు పరిచయం కానున్నారు. బోనీ కపూర్ నిర్మాతగా , H. వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా రూపొందిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ తమిళ రీమేక్ నెర్కొండ పార్వై ఆగస్ట్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. వీరం, ఎన్నై అరిందాళ్, వేదాళం, వివేగం, విశ్వాసం వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో కోలీవుడ్ లో దూసుకుపోతున్న అజిత్
హీరో గా, H. వినోద్ దర్శకత్వంలో అజిత్ 60 వ మూవీని బోనీ కపూర్ నిర్మించనున్నారు.
[youtube_video videoid=lDv8wGWOeQw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: