లేడీ సూపర్ స్టార్ విజయశాంతి… ఒకవైపు కమర్షియల్ హీరోయిన్‌గా మురిపిస్తూనే, మరోవైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌తోనూ సంచలనం సృష్టించిన నిన్నటి తరం అగ్రశ్రేణి కథానాయిక. ఇదిలా ఉంటే… సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఈ టాలెంటెడ్ స్టార్ రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాదాపు 13 ఏళ్ళ తరువాత మళ్ళీ మేకప్ వేసుకోనున్న ఈ లేడీ సూపర్ స్టార్… ఈ సినిమా కోసం ఫిట్‌గా తయారవడమే కాకుండా 55 రోజుల కాల్షీట్స్ కూడా అడ్జస్ట్ చేసారట. ఈ నేపథ్యంలో… హైదరాబాద్‌లో జరుగుతున్న నయా షెడ్యూల్‌లో రాములమ్మ కూడా జాయిన్ అవుతున్నారట. ఆగస్టు 9 (మహేష్ పుట్టినరోజు) నుంచి వారం రోజుల పాటు ఆమె చిత్రీకరణలో పాల్గొనబోతున్నారని సమాచారం. అనంతరం కొంత గ్యాప్ తీసుకుని నిరవధికంగా చిత్రీకరణలో పాల్గొంటారని తెలుస్తోంది. అంతేకాదు… ఇందులో కథానాయకుడి పాత్రకి దీటుగా ఉండే శక్తిమంతమైన పాత్రలో విజయశాంతి దర్శనమివ్వనున్నారని టాక్.
కాగా… ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’… 2020 సంక్రాంతికి తెరపైకి రానుంది.
[youtube_video videoid=ysbe4JodbNM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: