వాల్మీకి సెట్ లో ఆస్కార్ విన్నర్

2019 Latest Telugu Film News, Hollywood Touch To Varun Tej Valmiki, Oscar winner in Valmiki Sets, Oscar winner Robert Richardson, Oscar winner Robert Richardson visits Varun Tej Valmiki movie Sets, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Valmiki movie Sets Visited by Robert Richardson, Varun Tej Valmiki Movie, Varun Tej Valmiki Movie Shooting Updates

హరీష్ శంకర్ దర్శకత్యంలో వాల్మీకి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమాను మొదట సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ చేశారు. అయితే మళ్లీ రిలీజ్ డేట్ ను మార్చారు. సెప్టెంబర్ 13వ తేదీన సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ లో ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు పొందిన రిచర్డ్ సన్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని హరీష్ శంకర్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. గాడ్ ఆఫ్ సినిమాటోగ్రఫీ, మూడు సార్లు ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు పొందిన రిచర్డ్ సన్ వాల్మీకి సెట్స్ కి రావడం జీవితంలో మరువలేని అనుభూతి అంటూ ఉద్వేగంగా హరీష్ ట్వీట్ చేశారు.

జె ఎఫ్ కె(1991),ది ఏవియేటర్(2004), హ్యూగో(2011) చిత్రాలకు రిచర్డ్ సన్ ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇంకా ఈ సినిమా లో వరుణ్‌ తేజ్‌ మొదటిసారి గ్యాంగ్‌ స్టర్‌ గా డిఫరెంట్‌ క్యారెక్టర్‌ లో కనిపించబోతున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో త‌మిళ న‌టుడు అధ‌ర్వ మురళి కీలక పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

[subscribe]

[youtube_video videoid=t-SWlHFaFUk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =