
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 12


సెప్టెంబర్ 5 నుండి చైతు, సాయి పల్లవి చిత్రం?

శాండిల్‌వుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న వింక్ గర్ల్?
రవితేజ సినిమా తరహాలో విజయ్ దేవరకొండ చిత్రం?

సంచలన చిత్రం ‘అర్జున్ రెడ్డి’కు రెండేళ్ళు

ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో ‘టాక్సీవాలా’ భామ?

'వెంకీ మామ'లో స్కూల్ టీచర్‌గా రాశీ ఖన్నా?
నందితా మరో ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్
తమిళనాడు ఫ్యాన్స్ కు ప్రభాస్ సర్ప్రైజ్
'నీ కోసం' కు పవర్ స్టార్ అభినందనలు
సాహో హక్కులు ఆ వార్తల్లో నిజం లేదు

"శ్రీకారం" మూవీ లో రైతు పాత్ర

అర్జునుడుగా నటించాలని ఉంది -ప్రభాస్

బన్నీ కి జోడీ గా బాలీవుడ్ భామ..?
గుజరాతి సినిమాకి రీమేక్ గా 'ఎంత మంచివాడవురా'?
బన్నీ సరసన వరుణ్ హీరోయిన్?

నవంబర్ నుండి వెంకీ కొత్త చిత్రం?
ఈ ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్ 2’ రూపంలో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న విక్టరీ వెంకటేష్... ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కలసి ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను... కె.ఎస్.రవీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది.

సెప్టెంబర్ 5 నుండి చైతు, సాయి పల్లవి చిత్రం?
యువ కథానాయకుడు నాగచైతన్య, డ్యాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ వద్ద సహాయకుడిగా పనిచేసిన పవన్ సంగీతం అందిస్తున్నాడు.

శాండిల్‌వుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న వింక్ గర్ల్?
ప్రియా ప్రకాష్ వారియర్... ఒక్క కన్నుగీటుతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కేరళ కుట్టి. మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’(తెలుగులో ‘లవర్స్ డే’)తో హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ... ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే... ఆ యా చిత్రాలన్నీ ఈ టాలెంటెడ్ బ్యూటీకి ఆ యా భాషల్లో డెబ్యూ ఫిల్మ్స్ కావడం విశేషం.
రవితేజ సినిమా తరహాలో విజయ్ దేవరకొండ చిత్రం?
వైవిధ్యభరితమైన చిత్రాలతో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం... క్రాంతి మాధవ్ డైరెక్టోరియల్‌లోనూ... అలాగే మల్టీలింగ్వల్ మూవీ ‘హీరో’లోనూ కథానాయకుడిగా నటిస్తున్నాడు విజయ్. వీటితో పాటు... ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘ఫైటర్’ చిత్రంలోనూ నటించనున్నాడు ఈ యూత్ ఐకాన్. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపిస్తాడని టాక్.
'కౌసల్య కృష్ణమూర్తి' చాలా గొప్ప సినిమా - మేమెంతో గర్వపడుతున్నాం
ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.47గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్. ప్రముఖ తమిళ్ హీరో శివ కార్తికేయన్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ విభిన్నకథా చిత్రం ఆగష్టు 23 ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్‌హిట్ టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధిస్తూ.. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆగస్ట్ 24న హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో చిత్ర యూనిట్…

సంచలన చిత్రం ‘అర్జున్ రెడ్డి’కు రెండేళ్ళు
ప్రతీ కథానాయకుడి నటజీవితంలో మైలురాయిలా నిలిచిపోయే సినిమా ఒకటి ఉంటుంది. అలా... యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కెరీర్‌లో కూడా మైల్ స్టోన్‌లా నిలిచిపోయే చిత్రం ‘అర్జున్ రెడ్డి’. విజయ్‌ను యూత్ ఐకాన్‌గా మార్చిన ఈ సెన్సేషనల్ మూవీతో... సందీప్ రెడ్డి వంగ దర్శకుడిగా పరిచయమయ్యాడు. అంతేకాదు... ఈ చిత్రంతోనే ఉత్తరాది భామ షాలిని పాండే కథానాయికగా పరిచయమైంది. రాహుల్ రామకృష్ణ, సంజయ్ స్వరూప్, కమల్ కామరాజు, సీనియర్ యాక్ట్రెస్ కాంచన తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు.

ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో ‘టాక్సీవాలా’ భామ?
‘టాక్సీవాలా’ (2018) చిత్రంతో తెలుగునాట కథానాయికగా తొలి అడుగులు వేసింది ప్రియాంకా జవాల్కర్. సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఆ చిత్రంలో... అభినయానికి అవకాశమున్న పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ తెలుగమ్మాయి. ఇదిలా ఉంటే... తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక కథానాయికగా ఎంపికైనట్టు టాక్.

'వెంకీ మామ'లో స్కూల్ టీచర్‌గా రాశీ ఖన్నా?
`ఊహలు గుసగుసలాడే` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది రాశి ఖన్నా. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీకి... మళ్ళీ ‘తొలిప్రేమ’తోనే ఆ స్థాయి కీర్తి దక్కింది. కాగా... ప్రస్తుతం రాశి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాయికగా నటిస్తోంది. ఆ చిత్రాలే... ‘వెంకీమామ’ (వెంకటేష్, నాగచైతన్య కథానాయకులు), ‘ప్రతీరోజు పండగే’ (సాయితేజ్ హీరో), విజయ్ దేవరకొండ - క్రాంతి మాధవ్ కాంబినేషన్ మూవీ. వీటిలో నాగచైతన్యకి జోడీగా నటిస్తున్న `వెంకీమామ`నే ముందుగా తెరపైకి రానుంది. అంతేకాదు... ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌లో కనిపించనుందట రాశి.
నందితా మరో ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్
శివ కంఠమనేని కథానాయకుడిగా లైట్ హౌస్ సినీ మేజిక్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 2గా రూపొందుతోన్న నూతన సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో శనివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు, కె.ఎస్. శంకరరావు, వి. కృష్ణారావు నిర్మాతలు. ఇంకా ఈ సినిమాలో నందితా శ్వేత, రాశి. కె. అశోక్‌కుమార్. శ్రీనివాసరెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవంలో శివ కంఠమనేని, నందితా శ్వేత, రాశిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ‘వాసవి గ్రూప్’ విజయ్‌కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా... అశోక్ కుమార్…
తమిళనాడు ఫ్యాన్స్ కు ప్రభాస్ సర్ప్రైజ్
మొత్తానికి ఫ్యాన్స్ కు రోజుకో సార్ ప్రైజ్ ఇస్తున్న ప్రభాస్ ఇప్పుడు తాజాగా తమిళనాడు ఫ్యాన్స్ కి స్పెషల్ సుర్ప్రైజ్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ స్వయంగా ప్రకటించింది. తమిళ్ కూడా ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రభాస్ సాహో ప్రచారంలో భాగంగా నేడు చెన్నై వెళ్లారు. అక్కడ మూవీ జర్నలిస్టులతో ఆయన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. దీనిలో భాగంగానే తమిళనాడు ఫ్యాన్స్ కి స్పెషల్ సుర్ప్రైజ్ అంటూ ఓ ప్రకటన చేశారు. ఆ సర్పైజ్ కోసం నేడు 8గంటలకి సత్యం సినిమాస్ కి రండి అంటూ పిలుపునిచ్చారు. దీనితో డార్లింగ్ ప్రభాస్ ఇవ్వబోయే ఆ సడన్ సర్ప్రైజ్ ఏమైయుంటుందా అని ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోయింది. మరి చూద్దాం ఆ…
వయసును వెనక్కి నెట్టేస్తున్నారు - యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నారు
వయసు పెరుగుతున్న కొద్దీ అందం, ఆకర్షణ తగ్గడం కామన్. కానీ ఇది మన హీరోలకు మినహాయింపు అని చెప్పొచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా చిన్నగా కనిపిస్తున్నారు తప్ప.. ఏ మాత్రం వయసు కనిపించట్లేదు. అలా అని ఏదో వారికీ అది లక్ అనుకుంటే పొరపాటే. వాళ్లు చేసే డైటింగ్.. జిమ్ లలో చెమటోడ్చి తమ బాడీ ని ఫిట్ గా ఉంచుకోవడమే. ఇది చెప్పడానికి ఈజీ గా ఉన్నా చేసేవాళ్ళకే ఎంత కష్టమో అర్ధమవుతుంది. అంత కష్టపడుతున్నారు కాబట్టే మన హీరోలు వయసు పెరుగుతున్నా ఇంకా యంగ్ లుక్స్ తో.. కొత్త కొత్త మేకోవర్ లతో ఇప్పుడున్న యంగ్ హీరోలకి సైతం పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుపోతున్నారు. మరి ఆ హీరోలు ఎవరో ఓ లుక్కేద్దామా.
'నీ కోసం' కు పవర్ స్టార్ అభినందనలు
నవీన్ క్రియేషన్స్ రాజలింగం సమర్పణలో అవినాష్ కోకటి దర్శకత్వం లో అరవింద్ రెడ్డి, సుభాంగి పంత్, అజిత్ రాధారమ్, దీక్షితా పార్వతి ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా 'నీ కోసం'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఇక మంచి ఎక్కడున్నా ప్రొత్స్హహించే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘నీకోసం’ ని అభినందించి బెస్ట్ విషెస్ తెలిపారు. కొత్తదనం నిండిన ఈ ప్రేమకథ ట్రైలర్ ని చూసి ఆయన ఇంప్రెస్ అయ్యారు. ఈచిత్రం మంచి విజయం సాధించాలని కోరకున్నారు. ఈ విజయం కొత్త వాళ్లకు ఇన్సిపిరేషన్ గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తెలుగు పరిశ్రమకు చాలా అవసరం అని…
ఆయన ఆరోగ్యం పై ఊహాగానాలు, రేటింగ్ ల విన్యాసాలు చెయ్యదు.. ప్లీజ్
కొన్ని వార్తలు,కొన్ని ఊహాగానాలు విన్న తరువాత ఊపిరిరాగినంత పనవుతుంది. కొద్దిసేపటికి అవి నిజం కాదని తెలిసాక కూడా బరువెక్కిన హృదయాలు తేలిక పడవు.ఈ రోజు అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో కొద్ది సేపు ప్రచారం జరిగి సద్దుమణిగింది. సన్నిహిత వర్గాల ద్వారా అది అబద్ధం అని తేలడంతో మనసు కుదుటపడింది.
సాహో హక్కులు ఆ వార్తల్లో నిజం లేదు
ప్రస్తుతం ఎక్కడ చూసినా సాహో మాట తప్పా ఇంకేం వినిపించట్లేదు. ఈ నెల 30వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రభాస్ ఓ రేంజ్ లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక చిత్ర యూనిట్ కూడా రోజుకో అప్ డేట్ ఇస్తూ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

"శ్రీకారం" మూవీ లో రైతు పాత్ర
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రైతు సమస్యల నేపథ్యం లో ఎమోషనల్ డ్రామా శ్రీకారం మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో హీరో శర్వానంద్ రైతు పాత్రలో నటించనున్నారని సమాచారం. రణరంగం మూవీ లో గ్యాంగ్ స్టర్ గా నటించిన శర్వానంద్ శ్రీకారం మూవీ లో రైతు గా నటించడం విశేషం.

అర్జునుడుగా నటించాలని ఉంది -ప్రభాస్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా, తెలుగు , తమిళ, హిందీ భాషలలో భారీ బడ్జెట్ తో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్ తో ఆకట్టుకున్న సాహో మూవీ పై ప్రేక్షక, అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీ గా చేపట్టింది. సాహో మూవీ ప్రమోషన్ లో భాగంగా 23వ తేదీ బెంగుళూరు లో పాత్రికేయులతో ప్రభాస్ సమావేశమయ్యారు.

బన్నీ కి జోడీ గా బాలీవుడ్ భామ..?
ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి ఇటీవలే 'అల వైకుంఠపురంలో' అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు చిత్ర యూనిట్. బన్నీ- అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కాబట్టి ఈ సినిమా పై కూడా ఉన్నాయి. ఈ సినిమాలో మరోసారి పూజా హెగ్డే బన్నీతో జతకట్టనుంది. ఇంకా ఈ సినిమాలో టబు, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక-హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు…
గుజరాతి సినిమాకి రీమేక్ గా 'ఎంత మంచివాడవురా'?
నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా ‘ఎంత మంచివాడవురా’ పేరుతో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘శతమానంభవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈ సినిమా... ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి... ఓ ఆసక్తికరమైన విషయమొకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
బల్గేరియాలో ‘ఆర్ ఆర్ ఆర్ ’
యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’. పేట్రియాటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో... కొమరం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నారు. చరణ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్న ఈ చిత్రంలో... బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, తమిళ దర్శకనటుడు సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
బన్నీ సరసన వరుణ్ హీరోయిన్?
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్’ (2015) చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది భామ దిశా పఠాని. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో... తన గ్లామర్‌తో కుర్రకారును కట్టిపడేసింది ఈ పొడుగుకాళ్ల సుందరి. ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ హాట్ బ్యూటీ... ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.