శాండిల్‌వుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ వింక్ గర్ల్?

2019 Latest Telugu Film News, Priya Prakash Varrier To Enter Sandalwood, Confirmed Priya Varrier Confirmed to make her Kannada debut, Priya Prakash Varrier Entered In Sandalwood, Priya Prakash Varrier is back in Sandalwood, Priya Prakash Varrier Latest Movie news, Prashanth Neel welcomes Priya Prakash Varrier to Sandalwood, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News

ప్రియా ప్రకాష్ వారియర్… ఒక్క‌ కన్నుగీటుతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కేరళ కుట్టి. మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’(తెలుగులో ‘లవర్స్ డే’)తో హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ… ప్ర‌స్తుతం వరుస సినిమాల‌తో బిజీగా ఉంది. అయితే… ఆ యా చిత్రాలన్నీ ఈ టాలెంటెడ్ బ్యూటీకి ఆ యా భాషల్లో డెబ్యూ ఫిల్మ్స్‌ కావడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘శ్రీదేవి బంగ్లా’తో ప్రియ హిందీనాట నాయికగా పరిచయమవుతుండ‌గా… యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్‌లో రానున్న సినిమాతో తెలుగులోనూ కథానాయికగా తొలి అడుగులు వేస్తోంది. అంతేకాదు… కన్నడ హీరో శ్రేయాస్ కె.మంజు, దర్శకుడు వి.కె.ప్రకాష్ కలయికలో రానున్న ‘విష్ణు ప్రియ’ అనే చిత్రంతో శాండిల్‌వుడ్‌లోనూ హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ కానుంది ప్రియ. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… సెప్టెంబర్ 9 నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

ఇలా వరుసగా పలు భాషల్లో హీరోయిన్ గా తొలి అడుగులు వేస్తున్న ఈ వింక్ బ్యూటీ… ఆ యా చిత్రాలతో ఎలాంటి ఫలితాలు అందుకుంటుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − four =