సంచలన చిత్రం ‘అర్జున్ రెడ్డి’కు రెండేళ్ళు

2019 Latest Telugu Film News, 2 Years For Cult Classi Arjun Reddy, Arjun Reddy Sucessfully Completed 2 Years, 2 Years For Arjun Reddy, Arjun Reddy Movie, Vijay Deverakonda Starrer Arjun Reddy Completed 2 Years, 2 Glorified Years For Arjun Reddy, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News

ప్రతీ కథానాయకుడి నటజీవితంలో మైలురాయిలా నిలిచిపోయే సినిమా ఒకటి ఉంటుంది. అలా… యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కెరీర్‌లో కూడా మైల్ స్టోన్‌లా నిలిచిపోయే చిత్రం ‘అర్జున్ రెడ్డి’. విజయ్‌ను యూత్ ఐకాన్‌గా మార్చిన ఈ సెన్సేష‌న‌ల్ మూవీతో… సందీప్ రెడ్డి వంగ దర్శకుడిగా పరిచయమయ్యాడు. అంతేకాదు… ఈ చిత్రంతోనే ఉత్తరాది భామ షాలిని పాండే కథానాయికగా పరిచయమైంది. రాహుల్ రామకృష్ణ, సంజయ్ స్వరూప్, కమల్ కామరాజు, సీనియర్ యాక్ట్రెస్ కాంచన తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రధన్ స్వరసారథ్యంలో “మరి మరి”, “మధురమే”, “గుండెలోన” వంటి పాటలు విశేషాదరణ పొందాయి. భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్ర‌ణ‌య్‌ రెడ్డి వంగ నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్… పలు ప్రాంతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది.

కాగా… ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనే రీమేక్ చేయగా… అక్కడ కూడా ఘ‌న‌విజయం సాధించడం విశేషం. ప్ర‌స్తుతం… తమిళంలో ‘ఆదిత్య వర్మ’ పేరుతో తెరకెక్కుతుండగా… కన్నడంలోనూ పునర్నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2017 ఆగస్టు 25న చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’… నేటితో రెండు వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.