‘టాక్సీవాలా’ (2018) చిత్రంతో తెలుగునాట కథానాయికగా తొలి అడుగులు వేసింది ప్రియాంకా జవాల్కర్. సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఆ చిత్రంలో… అభినయానికి అవకాశమున్న పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ తెలుగమ్మాయి. ఇదిలా ఉంటే… తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక కథానాయికగా ఎంపికైనట్టు టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘పెళ్లి చూపులు’ నిర్మాతలలో ఒకరైన రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. నూతన దర్శకురాలు సుజన తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో… ప్రియాంక హీరోయిన్‌గా సెలెక్ట్ అయినట్టు సమాచారం. అంతేకాదు… ఈ సినిమాలో ప్రియాంక ముస్లిం అమ్మాయిగా అభినయానికి అవకాశమున్న పాత్రలో నటిస్తోందని సమాచారం. సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ కూడా ఇందులో కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని… ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ నిర్మిస్తున్నారు. కాగా… త్వరలోనే ప్రియాంక ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























