ఆయన ఆరోగ్యం పై ఊహాగానాలు, రేటింగ్ ల విన్యాసాలు చెయ్యదు.. ప్లీజ్

2019 Latest Telugu Film News, Ramoji Rao Health Issue Rumors are Baseless, Ramoji Rao Health Rumors, Health Rumors on Ramoji Rao, Ramoji Rao Latest News, Baseless Rumors on Ramoji Rao, Ramoji Rao Facing Rumors, Ramoji Lands in Trouble With Health Issue Rumors, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News

కొన్ని వార్తలు,కొన్ని ఊహాగానాలు విన్న తరువాత ఊపిరిరాగినంత పనవుతుంది. కొద్దిసేపటికి  అవి నిజం కాదని తెలిసాక కూడా బరువెక్కిన హృదయాలు తేలిక పడవు.ఈ రోజు అలాంటి  వార్త ఒకటి సోషల్ మీడియాలో కొద్ది సేపు ప్రచారం జరిగి సద్దుమణిగింది. సన్నిహిత వర్గాల ద్వారా అది అబద్ధం అని తేలడంతో మనసు కుదుటపడింది.

అయితే ఆ నిజ నిర్దారణ జరిగేలోపు మనసు ఎంతగా కలవరపడుతుందో చెప్పనలవి కాదు.

సుప్రసిద్ద పత్రికాధిపతి, పారిశ్రామికవేత్త, నిర్మాత, స్టూడియో అధినేత రామోజీరావు ఆరోగ్యం క్షీణించిదని ,ఆయన ఐ.సీ.యూ.లో చికిత్స పొందుతున్నారని ,విదేశీ వైద్యానికి ఆయన తిరస్కరించడంతో ఫిల్మ్ సిటీలోనే అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు జరిగాయనే వార్త ఒకటి సోషల్ మీడియాలో గుప్పుమంది.అయితే వెంటనే ‘ఈనాడు’ ఆఫీసుకు ఫోన్ చేసి వాకబు చేయగా ఆ వార్త అబద్ధమని ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తేలింది… దానితో  మనసు కుదుటపడింది.

మరి ఈ నిరాధార వార్త ఎలా పుట్టుకొచ్చింది? మీడియా రేటింగ్ ల  రేసుకు రామోజీరావు లాంటి మీడియా జయింట్ కు కూడా మినహాయింపు లేదా? సాక్షాత్తు ఆయన ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఊహాగానాలు రాయటం మీడియా కక్కుర్తికి నిదర్శనం.ఫస్ట్ ప్రజెంటేషన్, ఎక్స్క్లూజివ్ ప్రజెంటేషన్ అనే ర్యాట్ రేసులో పడి కొట్టుకుపోతున్న మీడియాకు కాస్త సహనాన్ని, సంయమనాన్ని నేర్పు దేవుడా అని ప్రార్ధించడం తప్ప చేయగలిగింది ఏమి లేదు.

ఏది ఏమైనా విన్న వార్తలో నిజం లేదు…అదే సంతోషం… అదే పది వేలు. దశాబ్దాలుగా తెలుగు వారి జీవనవిధానంలో అంతర్భాగంగా మమేకమైన కీర్తి శిఖరం,వేలాది ఉద్యోగుల జీవన ప్రధాత అయిన “రామోజీరావు” ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలన్నది జాతి ఆకాంక్ష.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here