గుజరాతి సినిమాకి రీమేక్ గా ‘ఎంత మంచివాడవురా’?

2019 Latest Telugu Film News, Nandamuri Kalyan Ram Movie Latest Update, Kalyan Ram new film Enta Manchivadavura, Enta Manchivadavura Movie Latest News, Enta Manchivadavura Release Updates, Enta Manchivadavura Remake Movie Updates, Nandamuri Kalyan Ram New Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News

నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా ‘ఎంత మంచివాడవురా’ పేరుతో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘శతమానంభవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈ సినిమా… ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి… ఓ ఆసక్తికరమైన విషయమొకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేమిటంటే… గత ఏడాది గుజరాతి భాషలో విడుదలై ఘన విజయం సాధించిన ‘ఆక్సిజన్’ సినిమాకి రీమేక్‌గా ‘ఎంత మంచివాడవురా’ తెరకెక్కుతోందని తెలుస్తోంది. కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తూ రూపొందిన ‘ఆక్సిజన్’ని… తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారట. ఏదేమైనా, ఈ రీమేక్ కి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా… గోపిసుందర్ బాణీలు స‌మ‌కూరుస్తున్న‌ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్… 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 10 =