
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 11


సెప్టెంబర్ తొలి వారం నుండి ‘వెంకీమామ’ తాజా షెడ్యూల్?

అక్టోబర్ నుంచి పట్టాలెక్కనున్న ‘బంగార్రాజు’?

‘లక్ష్మీబాంబ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

జాన్వీపై వస్తున్న వార్తల్లో నిజం లేదు..!

కొత్త వాళ్లతో కొత్త తరహా ప్రేమ కథా చిత్రం

మెగా స్టార్ చిరంజీవి మూవీ లో విజయశాంతి ?

ఇస్మార్ట్ శంకర్ మూవీ తమిళ రీమేక్ లో ?

మానసిక ఒత్తిడికి మెడిటేషన్- శ్రద్ధా కపూర్

కీర్తి సురేష్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్

డేటింగ్ కు మాకు టైం లేదు..!

ఎవరు మూవీ టీమ్ కు అభినందనలు

గ్యాంగ్ లీడర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

అఖిల్ అక్కినేని మూవీ హీరోయిన్
గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై అఖిల్ అక్కినేని హీరో గా బొమ్మరిల్లు మూవీ గ్రాండ్ సక్సెస్ తో ఆ మూవీ పేరే తన ఇంటి పేరుగా మార్చుకున్న బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో పూజ హెగ్డే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారని సమాచారం. హీరోయిన్ క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ కావడంతో సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, రష్మిక పేర్లను పరిశీలించినా ఫైనల్ గా పూజ హెగ్డే ను మేకర్స్ఎంపిక చేశారు.

సెప్టెంబర్ తొలి వారం నుండి ‘వెంకీమామ’ తాజా షెడ్యూల్?
రియల్ లైఫ్ మేనమామ - మేనల్లుళ్ళు విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య... రీల్ లైఫ్‌లోనూ అవే పాత్రల్లో నటిస్తున్న చిత్రం `వెంకీమామ`. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి.సురేశ్ బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అక్టోబర్ నుంచి పట్టాలెక్కనున్న ‘బంగార్రాజు’?
‘కింగ్’ నాగార్జున కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలచిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. 2016 సంక్రాంతికి విడుదలైన ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌కి సీక్వెల్ ప్లాన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘బంగార్రాజు’ పేరుతో తెరకెక్కనున్న ఈ కొనసాగింపు చిత్రం... ‘సోగ్గాడే చిన్ని నాయనా’ని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోనే రూపొందనుంది. కాగా... నిజ జీవితంలో తండ్రీకొడుకులైన నాగార్జున, నాగచైతన్య... ఈ సినిమాలో తాత-మనవడుగా నటించబోతున్నట్లు సమాచారం.

మెగాస్టార్ మెగా హిట్ ‘చూడాలని వుంది!’కు 21 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో పలు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘చూడాలని వుంది!’ ఒకటి. భారీ బడ్జెట్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన వైజయంతీ మూవీస్ సంస్థ అధినేత సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత చిరు, అశ్వనీదత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘చూడాలని వుంది!’ కూడా అదే బాట పట్టింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరుకి జోడీగా సౌందర్య, అంజలా జవేరి నటించగా... ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వేణు మాధవ్, అల్లు రామలింగయ్య, ఎం.ఎస్.నారాయణ, ధూళిపాళ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
హిట్ ఇచ్చిన డైరెక్టర్ కే నాని మళ్ళీ గ్రీన్ సిగ్నల్..!
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ 'గ్యాంగ్ లీడర్' రిలీజ్ కు సిద్ధమైంది. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా... హీరో కార్తికేయ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, ప్రియదర్శి, రఘు బాబు, వెన్నెల కిషోర్, సత్య ముఖ్య పాత్రలలో నటించారు.

‘లక్ష్మీబాంబ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
2007లో తన స్వీయ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ముని అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు లారెన్స్. సూపర్ హిట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ముని సిరీస్ లో భాగంగా ఇప్పటివరకు కాంచన, గంగ, కాంచన 3 తెరకెక్కించి హిట్ లు కొట్టారు. ఇక కాంచన సినిమాను లారెన్స్ హిందీలో కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘లక్ష్మీబాంబ్’ పేరుతో రీమేక్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కియరా అద్వానీ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
కౌసల్య కృష్ణమూర్తి, ఏదైనా జరగొచ్చు కృష్ణ, వైజాగ్ కల్లెక్షన్స్
ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడం కామన్. కానీ ఈ శుక్రవారానికి మాత్రం కొంచెం స్పెషల్ ఉంది. సాహో ఎఫెక్ట్ తో గత శుక్రవారం ఒకటి కాదు రెండు కాదు ఒక్కరోజే పది సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడికి దిగాయి. మరి ఈ పది సినిమాల్లో ఏ సినిమాలు పోటీని తట్టుకొని నిలుస్తాయో అప్పుడే చెప్పలేం. మరి ఈ రోజు రిలీజ్ ఐన సినిమాల్లో ఏదైనా జరగొచ్చు, కౌసల్య కృష్ణమూర్తి సినిమాల వైజాగ్, కృష్ణ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

జాన్వీపై వస్తున్న వార్తల్లో నిజం లేదు..!
పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండలసినిమాపై ఇటీవలే ఓ క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్ గా వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు. ఇక మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన వచ్చి కొద్ది రోజులు గడవకుండానే ఈ మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో హాట్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నట్లు వార్తలు వచ్చాయి.

కొత్త వాళ్లతో కొత్త తరహా ప్రేమ కథా చిత్రం
ఇటీవలే హిప్పీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా నటి దిగంగనా సూర్యవన్షీ. ఆ సినిమా ఫలితం ఎలా వున్నా.. ఈ అమ్మడికి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇప్పడు మరో కొత్త సినిమాతో రాబోతుంది. లక్ష్, దిగంగనా సూర్యవన్షీ హీరోహీరోయిన్లుగా రమేశ్ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత పద్మావతి చదలవాడ మాట్లాడుతూ.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో సమాజంలోని ఓ అంశాన్ని తీసుకుని కొత్త తరహా ప్రేమ కథా చిత్రంగా రూపొందిస్తున్నామని తెలియజేశారు. ఈనెలలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తామని చెప్పారు.

మెగా స్టార్ చిరంజీవి మూవీ లో విజయశాంతి ?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు మూవీ తో లేడీ అమితాబ్ విజయశాంతి రీ ఎంట్రీ అవుతున్న విషయం తెలిసిందే. విజయశాంతి ఒక కీలక పాత్రలోనటిస్తున్నసరిలేరు నీకెవ్వరు మూవీ 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఆ సినిమా రిలీజ్ కాకుండానే మరో మూవీ కి విజయశాంతి ఎంపికయ్యారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మెగా స్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సోషల్ డ్రామా మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో ఒక కీలక పాత్రకు విజయశాంతి ఎంపికయ్యారని సమాచారం. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభమయి 2020 ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.

ఇస్మార్ట్ శంకర్ మూవీ తమిళ రీమేక్ లో ?
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్ జులై నెలలో రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లవర్ బాయ్. పక్కింటి కుర్రాడు వంటి రోల్స్ లో నటించే రామ్ ఈ మూవీ లో పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించి, తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు.

మానసిక ఒత్తిడికి మెడిటేషన్- శ్రద్ధా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించిన రెండు మూవీస్ ఒక వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ కానున్నందున మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. భారీ బడ్జెట్, భారీ తారాగణం తో ప్రభాస్ హీరో గా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30వ తేదీ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో గా హిందీ లో రూపొందిన రొమాంటిక్ కామెడీ డ్రామా చిచ్చోరే మూవీ సెప్టెంబర్ 6వ తేదీ రిలీజ్ కానున్నాయి. ఈ రెండు మూవీస్ ప్రమోషన్స్ లో శ్రద్ధా బిజీగా ఉన్నారు. బాఘీ3 మూవీ కి కమిట్ అయ్యారు.

కీర్తి సురేష్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్
తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది కీర్తి సురేష్. ప్రస్తుతం కీర్తి నరేంద్ర నాథ్ అనే కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుది. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. గతంలో ఈ సినిమా టైటిల్ మిస్ ఇండియా అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అనుకున్నట్టే మిస్ ఇండియా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

డేటింగ్ కు మాకు టైం లేదు..!
తెలుగు తెరపై ఎంతో మందివి హిట్ పెయిర్స్ చూసుంటాం. అలా ఇటీవల వచ్చిన నటుల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందనాది కూడా హిట్ పెయిర్ గా నిలిచింది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇక ఇదే కాంబినేషన్ లో 'డియర్ కామ్రేడ్' భారీ అంచనాలతో విడుదలై.. అనుకున్నంతగా అలరించలేకపోయింది. కథ పరంగా అందరికీ నచ్చినా కూడా కొంత ల్యాగ్, స్లో ఉండటంతో మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఎవరు మూవీ టీమ్ కు అభినందనలు
PVP సినిమా బ్యానర్ పై అడివి శేష్, రెజీనా జంటగా వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. నవీన్ చంద్ర ఒక కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లతో అంచనాలు పెంచిన ఎవరు మూవీ ప్రేక్షకాదరణ పొందింది.

ఇటలీ లో చాణక్య మూవీ సాంగ్ షూటింగ్
AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా తిరు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో రూపొందుతున్న స్పై థ్రిల్లర్ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. మెహరీన్, జరీన్ ఖాన్ కథానాయికలు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. RAW ఏజెంట్ గా గోపీచంద్ నటిస్తున్న ఈ మూవీ లో రాజస్థాన్ లో చిత్రీకరించిన యాక్షన్ సీన్స్ హై లైట్ గా నిలుస్తాయి.

#KRKR మూవీ "క్యాస్ట్ ఫీలింగ్" సాంగ్ రిలీజ్ డేట్
ప్రముఖ నిర్మాత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ మూవీస్ కు కేంద్ర బిందువుగా మారారు. రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి మూవీస్ రూపొందించిన వర్మ ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యం లో కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందిస్తున్నారు. ఈ మూవీ లోని మొదటి సాంగ్ కత్తులు లేవిపుడు .. చిందే నెత్తురు లేదిపుడు అనే సాంగ్ ను ఆగస్ట్ 9వ తేదీ రిలీజ్ చేశారు. మరో సాంగ్ క్యాస్ట్ ఫీలింగ్ ను 27 వ తేదీ రిలీజ్ చేస్తున్నారు.
సాహో నుండి నాలుగో పాట రిలీజ్
రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ‘సాహో’ టీం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఇక ఇప్పటివరకు 'సయ్యా సైకో' 'ఏ చోట నువ్వున్న' 'బ్యాడ్ బాయ్' అనే మూడు పాటలను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఈ రోజు నాలుగో పాటను రిలీజ్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్‌ను ఇచ్చారు. ‘బేబీ ఓన్ట్ యు టెల్ మీ..’ అంటూ సాగే పాటను ఈ రోజు రిలీజ్ చేసారు. మంచి మెలోడీ తో ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది.

గ్యాంగ్ లీడర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరో గా 'గ్యాంగ్ లీడర్' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఆగష్ట్ 30వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా... సాహో రిలీజ్ ఉండటంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకున్నారు. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

‘ఆర్ ఆర్ ఆర్’... కొమరం భీమ్ ఫస్ట్ లుక్ అప్‌డేట్
వాస్తవిక పాత్రలు, కల్పిత ఘటనలతో రూపొందుతున్న పేట్రియాటిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ మధ్య చిగురించిన స్నేహం... ఒకరి జీవితంపై మరొకరి ప్రభావం అనే ఆసక్తికరమైన అంశాలతో దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్... అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన చిత్రీకరణ బల్గేరియాలో జరుగుతోంది. కొమరం భీమ్ పాత్రధారి తారక్ పై కొన్ని కీలక ఘట్టాలను అక్కడ పిక్చరైజ్ చేస్తున్నారు.