న‌వంబ‌ర్ నుండి వెంకీ కొత్త చిత్రం?

2019 Latest Telugu Film News, Venkatesh New Movie To Begin From November, Venkatesh Latest Movie News, Venkatesh New Movie, Venkatesh New Movie Shoot Starts From November, Venkatesh Upcoming Movie Shoot Starts From November, Venkatesh New Project from November, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News

ఈ ఏడాది సంక్రాంతికి ‘ఎఫ్ 2’ రూపంలో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న విక్టరీ వెంకటేష్… ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కలసి ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను… కె.ఎస్.రవీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… దసరాకి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన త్రినాథరావు నక్కిన డైరెక్షన్‌లో వెంకీ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం… నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. కాగా… ఈ సినిమాలో వెంకీ డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించడమే కాకుండా… మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అల‌రించ‌నున్నాడ‌ని సమాచారం. డి.సురేష్ బాబు నిర్మించనున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి… మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =