బ‌న్నీ స‌ర‌స‌న వ‌రుణ్ హీరోయిన్‌?

2019 Latest Telugu Film News, Varun Tej Heroine For Allu Arjun, Allu Arjun to star opposite Disha Patani in Sriram Venu upcoming, Disha Patani in Allu Arjun Next, Allu Arjun Latest Movie News, Allu Arjun And Disha Patani Combo Next, Disha Patani Ropped An interesting Role, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్’ (2015) చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది భామ దిశా పఠాని. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో… తన గ్లామర్‌తో కుర్రకారును కట్టిపడేసింది ఈ పొడుగుకాళ్ల సుందరి. ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ హాట్ బ్యూటీ… ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో ‘ఐకాన్’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొంద‌నున్న‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కథానాయిక పాత్ర కోసం దిశను ఎంపిక చేసిందట చిత్ర బృందం. టాలీవుడ్ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ ‘దిల్’ రాజు నిర్మిస్తున్న‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్… ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. కాగా… త్వ‌ర‌లోనే దిశ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే… ప్రస్తుతం ‘ఆషికీ 2’ ఫేమ్ మోహిత్ సూరి దర్శకత్వం వ‌హిస్తున్న హిందీ చిత్రం ‘మలంగ్’లో దిశ కథానాయికగా నటిస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + six =