యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’. పేట్రియాటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో… కొమరం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నారు. చరణ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్న ఈ చిత్రంలో… బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, తమిళ దర్శకనటుడు సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే…ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ బల్గేరియాలో జరుగుతోంది. దాదాపు నెల రోజుల పాటు నిరవధికంగా సాగే ఈ షెడ్యూల్‌లో… యన్టీఆర్‌పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
కాగా… దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… 2020 జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: