వయసును వెనక్కి నెట్టేస్తున్నారు – యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నారు

2019 Latest Telugu Film News, Senior Heroes Giving Tough Competition to Young Heroes, Senior Heroes, Senior Heroes Copeting Young Heroes, Senior Heroes vs Young Heroes, Mega star Chiranjeevi Latest Movie News, Balakrishna Latest Movie News, Telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News

వయసు పెరుగుతున్న కొద్దీ అందం, ఆకర్షణ తగ్గడం కామన్. కానీ ఇది మన హీరోలకు మినహాయింపు అని చెప్పొచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా చిన్నగా కనిపిస్తున్నారు తప్ప.. ఏ మాత్రం వయసు కనిపించట్లేదు. అలా అని ఏదో వారికీ అది లక్ అనుకుంటే పొరపాటే. వాళ్లు చేసే డైటింగ్.. జిమ్ లలో చెమటోడ్చి తమ బాడీ ని ఫిట్ గా ఉంచుకోవడమే. ఇది చెప్పడానికి ఈజీ గా ఉన్నా చేసేవాళ్ళకే ఎంత కష్టమో అర్ధమవుతుంది. అంత కష్టపడుతున్నారు కాబట్టే మన హీరోలు వయసు పెరుగుతున్నా ఇంకా యంగ్ లుక్స్ తో.. కొత్త కొత్త మేకోవర్ లతో ఇప్పుడున్న యంగ్ హీరోలకి సైతం పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుపోతున్నారు. మరి ఆ హీరోలు ఎవరో ఓ లుక్కేద్దామా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ చిరంజీవి

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా పనుల్లో బిజీ గా వున్నారు. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. కథ ప్రకారం ఈ సినిమాలో చిరు రెండు పాత్రలు పోషించనున్నాడు. అందులో ఒక కోసం చిరంజీవి దాదాపు 10 కిలోలకు పైగా బరువు తగ్గి యంగ్ లుక్ లోకి వచ్చేసారు. సరిగ్గా పాతికేళ్ల క్రితం చిరంజీవి ఎలా ఉండేవారే.. అలా సూపర్ యంగ్‌గా కనిపిస్తున్నాడు. చక్కగా ఒక సైడ్‌కు దువ్విన జుట్టుతో, కొద్దిగా సిగ్గు పడుతూ.. చేతికి గడియారంతో, కళ్ల జోడు పెట్టి.. బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

బాలకృష్ణ

మొత్తానికి తన న్యూ లుక్ తో సోషల్ మీడియాలో షాక్ చేసాడు బాలయ్య. ఎన్నో ఏళ్లుగా ఒకే లుక్ తో కాస్త బోర్ కొట్టించిన బాలకృష్ణ అసలు ఎవరూ ఊహించలేని లుక్ తో ఫ్యాన్స్ కు షాకిచ్చాడు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా థాయ్‌లాండ్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో భాగంగానే బాలయ్య తన లుక్‌ను పూర్తిగా మార్చేశాడు.

నాగార్జున

ఇక ఈయనకు మన్మథుడు అన్న పేరే ఉంది. ఏ ముహుర్తాన ఆయనకు ఆ పేరు వచ్చిందో కానీ.. నిజంగానే అయన మన్మథుడే. ఇటీవల వచ్చిన మన్మథుడు 2 సినిమా లో అయన లుక్ చూస్తేనే అర్ధమవుతుంది. సినిమా ఫలితం మాట ఎలా వున్నా.. లుక్స్ పరంగా మాత్రం సూపర్. ఈ సినిమా చూసిన తర్వాత ఆయనకు 60 సంవత్సరాలు వస్తున్నాయంటే నమ్మడం కష్టమే.

మహేష్ బాబు

ఇక మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ ప్రిన్స్ అనే బిరుదుకు సరిగ్గా సరిపోతాడు. మహేష్ కూడా రోజు రోజు కు చిన్న వాడిపోతున్నాడు తప్ప అస్సలు వయసు మాత్రం పెరుగుతుందంటే నమ్మలేం. మహర్షి సినిమాలో స్టూడెంట్ పాత్రలో కూడా కరెక్ట్ గా సరిపోయాడంటేనే అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఇప్పుడు స్టూడెంట్ గా చూపించాలంటే కష్టమైన విషయమే. కానీ అక్కడుంది మహేష్ కాబట్టి పని ఈజీ ఐపోయింది. ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వం లో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్నాడు.

రవితేజ

వరుస ప్లాప్స్ వచ్చినా కూడా మాస్ మహా రాజా రవి తేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ‘డిస్కో రాజా’ సినిమాతో వస్తున్నాడు మాస్ రాజా. ఈ సినిమాలో రవితేజ రెండు షేడ్స్ వున్న పాత్రలు చేస్తున్నట్టు సమాచారం. అందులో ఒక పాత్ర కోసం రవితేజ.. మరి యంగ్‌గా కనిపించాలి. దీనికోసం మాస్‌రాజా బాగానే వర్కౌట్ చేసి తన లుక్‌ను మార్చుకున్నాడు. మీసాలు ట్రిమ్ చేసి.. కాస్తంత స్లిమ్ అయ్యాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − three =