‘కౌసల్య కృష్ణమూర్తి’ చాలా గొప్ప సినిమా – మేమెంతో గర్వపడుతున్నాం

2019 Latest Telugu Film News, Producer KS Ramarao About Kousalya Krishna Murthy, Producer KS Ramarao, Kousalya Krishna Murthy Movie Latest News, Producer KS Ramarao Beautiful Words About Kousalya Krishna Murthy, KS Ramarao Comments on Kousalya Krishna Murthy, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌. ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ విభిన్నకథా చిత్రం ఆగష్టు 23 ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో మంచి కలెక్షన్స్‌ సాధిస్తూ.. సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆగస్ట్‌ 24న హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో చిత్ర యూనిట్‌ సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ – ”మా బ్యానర్‌లో తెరకెక్కిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ ఆగష్టు 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మా చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఓవర్సీస్‌లోనూ ఇటు ప్రేక్షకులతో పాటు సమీక్షకుల ప్రశంసలు లభించాయి. దానికి కారణమైన దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు, హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్‌, రాజేంద్ర ప్రసాద్‌, కార్తీక్‌రాజులను అభినందిస్తున్నాను. సినిమాకు మంచి ప్రశంసలు లభించినా కమర్షియల్‌గా ఇంకా మంచి సక్సెస్‌ సాధించడం ఎంతో అవసరం. చిన్న బడ్జెట్‌ సినిమాలకు, సమాజానికి ఉపయోగపడే ఒక పర్పస్‌ఫుల్‌ మూవీస్‌కి మీ అందరి ప్రోత్సాహం కావాలి. అప్పుడే ఇండస్ట్రీలో మంచి సినిమాలు రావడానికి స్కోప్‌ ఉంటుంది. సినిమా చూసినవారు ఒకప్పుడు ‘శంకరాభరణం’, ‘మాతృదేవోభవ’ లాంటి మరో గొప్ప సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’ అంటున్నారు. మీ అందరి సద్విమర్శలు మా సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ మధ్యకాలంలో అన్ని వెబ్‌ సైట్స్‌ ఇంత గొప్పగా రాసిన సినిమా, అన్ని వెబ్‌ సైట్స్‌లోనూ 3.5 నుండి 4 వరకూ రేటింగ్స్‌ రావడం విశేషం. ఒక మంచి సినిమాను మీడియా ఎంత బాగా ప్రోత్సహిస్తుంది అనడానికి ఈ రివ్యూలు నిదర్శనం. మా టీమ్‌ అందరం గర్వంగా చెప్పుకునే ‘కౌసల్య కృష్ణమూర్తి’ గొప్ప విజయం సాధించడానికి మీ అందరి సహకారం తప్పకుండా ఉంటుందని నమ్ముతున్నాను. ఇక నుండి క్రియేటివ్‌ కమర్షియల్స్‌ నుండి కచ్చితమైన, మంచి పర్పస్‌ ఉన్న మూవీస్‌ వస్తాయని, మా రాబోయే సినిమాల్లో కూడా అదే క్వాలిటీ, అదే నిజాయితీని మీరు చూస్తారని నమ్ముతున్నాను. అలాగే క్రియేటివ్‌ కమర్షియల్స్‌లో భాగం అయిన బి.ఎ.రాజుగారికి, సి జోన్‌ విశ్వకి థాంక్స్‌. ” అన్నారు.

హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్‌ మాట్లాడుతూ – ”తమిళ్‌లో ఎలా మంచి రివ్యూస్‌, రెస్పాన్స్‌ వచ్చిందో అంతకన్నా మంచి రెస్పాన్స్‌ తెలుగులో కూడా వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు. థియేటర్స్‌లో 70 పర్సెంట్‌ ఆక్యుపెన్సీ ఉంది. చాలా మంచి సినిమా అని మౌత్‌ పబ్లిసిటీ కూడా చాలా బాగుంది. అలాగే బుక్‌మై షో లో 92 పర్సెంట్‌ అప్రిసియేషన్‌ ఉంది. మీడియా మంచి సహకారం ఉంది. ‘కౌసల్య కృష్ణమూర్తి’ లాంటి మంచి సినిమాలను సపోర్ట్‌ చేస్తేనే మా లాంటి యంగ్‌స్టర్స్‌కి విభిన్న తరహా చిత్రాల్లో నటించడానికి, మంచి సినిమాలు రూపొందడానికి ఉపయోగపడుతుంది. నిన్న మా టీమ్‌ అందరం హైదరాబాద్‌ శాంతి థియేటర్‌లో సినిమా చూశాం. మంచి రెస్పాన్స్‌ ఉంది. చాలా సంవత్సరాల తరువాత మరో గొప్ప సినిమా చూశాం అని చెప్పడం హ్యాపీగా ఉంది. అందరూ థియేటర్‌లోనే సినిమా చూడండి” అన్నారు.

దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు మాట్లాడుతూ – ”’కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాకు రిలీజైన అన్ని చోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఏదైనా సినిమాకు ఫౌండేషన్‌ కథ. అలాంటి ఒక మంచి కథను సెలెక్ట్‌ చేసుకోవడంలోనే మేము సగం విజయం సాధించాం. అలాగే క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌లో గతంలో వచ్చిన ఎన్నో మంచి సినిమాలకు ధీటుగా ఉండేలా ఈ సినిమా ఉంది. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌లో మంచి సినిమాలే వస్తాయి అని మరోసారి ఈ సినిమా ప్రూవ్‌ చేసింది. సినిమా రిలీజయ్యాక నా మిత్రులు, ఇండస్ట్రీ ప్రముఖులు ఫోన్‌ చేసి ప్రశంసించారు. ‘సుడిగాడు’ తరువాత ఇంత మంచి రెస్పాన్స్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు వారికి అందుబాటులో ఉన్న మాధ్యమం ద్వారా సినిమా గురించి తెలుసుకొని థియేటర్‌కి వస్తున్నారు. మంచి సినిమాలకు ప్రేక్షకులే పబ్లిసిటీ చేస్తారని మళ్ళీ ప్రూవ్‌ అయింది. ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాకు 1500 వరకూ పాజిటివ్‌ రివ్యూస్‌ వచ్చాయి. ఈ సినిమాను ఆడియన్స్‌కి రీచ్‌ చేయడానికి బి.ఎ.రాజుగారు తన సొంత సినిమా కన్నా ఎక్కువ కష్టపడ్డారు. అలాగే డిజిటల్‌ పబ్లిసిటీలో సి జోన్‌ విశ్వ చాలా సపోర్ట్‌ చేశారు. ఇంత మంచి కథ అందించిన అరుణ్‌ రాజా కామరాజ్‌గారికి, తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ‘కౌసల్య కృష్ణమూర్తి’ నా కెరీర్‌లో ఒక మైల్‌ స్టోన్‌ మూవీగా నిలిచిపోతుంది” అన్నారు.

లిరిసిస్ట్‌ రాంబాబు గోసల మాట్లాడుతూ – ”ఈ చిత్రంలో ‘రాకాసి గడుసు పిల్లా’ పాటతో పాటు బ్యాక్‌ గ్రౌండ్‌లో వచ్చే నాలుగు బిట్‌ సాంగ్స్‌ రాయడం జరిగింది. సందర్భాను సారంగా సాగే మంచి పాటలను ఒక గొప్ప సినిమాకు రాసే అవకాశం ఇచ్చిన కె.ఎస్‌. రామారావుగారికి, భీమినేనిగారికి థాంక్స్‌” అన్నారు.

నిర్మాత బి.ఎ. రాజు మాట్లాడుతూ – ”మనం ఎన్ని సినిమాలకు వర్క్‌ చేసినా కొన్ని సినిమాలు మన లైఫ్‌ లాంగ్‌ గుర్తుంటాయి. అలాంటి ఒక గొప్ప సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. సినిమా చూసి ఆడియన్స్‌తో పాటు మీడియావారు కూడా స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇవ్వడం మంచి పరిణామం. ఎక్స్‌ట్రార్డినరీ రివ్యూస్‌తో సినిమా విజయానికి తమ వంతు సహాకారం అందించారు. ఇది మన మీడియా సినిమా. ఈ సినిమా సక్సెసే మీడియా పవర్‌. గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌ జరుపుకునే రేంజ్‌కి ఈ సినిమాను తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సి జోన్‌ విశ్వ మాట్లాడుతూ – ”కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు” అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =