పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండలసినిమాపై ఇటీవలే ఓ క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్ గా వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు. ఇక మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన వచ్చి కొద్ది రోజులు గడవకుండానే ఈ మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో హాట్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నట్లు వార్తలు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా.. మరో వైపు జాన్వీ కపూర్ ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేసినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. గతంలో స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం వచ్చినా జాహ్నవి ఒప్పుకోలేదు. అలాగే ఇప్పుడు ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో జాన్వీకి సౌత్ సినిమాలు చేయడం ఇంట్రెస్ట్ లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ రూమర్ల పై జాహ్నవి తండ్రి బోనీ కపూర్ స్పందిస్తూ.. సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ అంటే మాకు చాలా ఇష్టం.. శ్రీదేవి సౌత్ లో ఎన్నో సినిమాలు చేసింది.. చిరంజీవి, కృష్ణ, మహేష్ బాబు ఇలా ఎంతో మంది హీరోలతో మంచి రిలేషన్ ఉంది.. మేము కూడా మంచి స్క్రిప్ట్ దొరికితే చేయాలని చూస్తున్నాం.. ఇప్పటివరకూ అలాటి కథలు మా దగ్గరకు రాలేదని చెప్పారు. ఇంకా స్టార్ హీరోల సినిమాలు తాను రిజెక్ట్ చేసినట్టు…తనకు సౌత్ సినిమాలపై ఇంట్రెస్ట్ లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని వివరణ ఇచ్చారు. మరి మంచి కథ దొరికితే జాన్వీసిద్దమేనట.. ఇంకెందుకు ఆలస్యం మంచి కథలు రెడీ చేసుకోండి..
కాగా ఇటీవలే బోనీ కపూర్ అజిత్ తో ‘నెర్కొండ పార్వాయి’ అనే సినిమాను తీయగా అది మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దీనితో మళ్లీ అజిత్ తోనే మారో సినిమా తీయనున్నట్టు తెలుస్తుంది. హెచ్ వినోద్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: