తెలుగు తెరపై ఎంతో మందివి హిట్ పెయిర్స్ చూసుంటాం. అలా ఇటీవల వచ్చిన నటుల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందనాది కూడా హిట్ పెయిర్ గా నిలిచింది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇక ఇదే కాంబినేషన్ లో ‘డియర్ కామ్రేడ్’ భారీ అంచనాలతో విడుదలై.. అనుకున్నంతగా అలరించలేకపోయింది. కథ పరంగా అందరికీ నచ్చినా కూడా కొంత ల్యాగ్, స్లో ఉండటంతో మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీరిద్దపై కూడా పలు గాసిప్స్ సోషల్ మీడియా లో హడావుడి చేసిన సంగతి తెలిసిందే. మాది జస్ట్ ఫ్రెండ్ షిప్ మాత్రమే అంటూ ఎన్నిసార్లు చెప్పినా కూడా.. వీరిద్దరి మధ్య ఏదో వుందంటూ… ఆఖరికి రష్మిక ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడానికి కూడా ఇదే కారణం అంటూ అబ్బో పలు రూమర్లు హల్చల్ చేసాయి. ఇప్పుడు ఏకంగా ఓ నెటిజెన్ డైరెక్ట్ గానే రష్మిక ను.. విజయ్, మీది పర్ఫెక్ట్ పెయిర్.. మీరు డేట్ చేయొచ్చు కదా అని అడుగగా..సారి మై డియర్ లవ్ నిన్ను డిస్సపాయింట్ చేసినందుకు.. మేమిద్దరం డేట్ చేసేంత ఖాళీగా లేము.. చాలా వర్క్ ఉంది.. మాకు మా పని పట్ల చాలా మర్యాద, ప్రేమ ఉంది.. అయినా నేను విజయ్ ను చాలా ఇరిటేట్ చేశా.. ఇంకో రెండేళ్ల వరకూ నాతో సినిమా చేయడు అంటూ చాలా సైలెంట్ గా కౌంటర్ ఇచ్చేసింది. మరి చూద్దాం రష్మిక ఇంత ఓపెన్ గా చెప్పిన తర్వాత అయినా గాసిప్స్ తగ్గుతాయేమో..
కాగా రష్మిక ప్రస్తుతం మహేష్ హీరోగా ఆర్మీ ఆఫీసర్ పాత్రలో వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’లో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. మరో వైపు విజయ్ ఇప్పటికే ఒక సినిమాలో నటిస్తుండగా ఇటీవలే.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నట్టు ప్రకటించారు. నవంబర్ లో ఈ సినిమాను సెట్స్ పై కి తీసుకెళ్లే ప్లాన్ లో వున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























