మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో పలు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘చూడాలని వుంది!’ ఒకటి. భారీ బడ్జెట్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన వైజయంతీ మూవీస్ సంస్థ అధినేత సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత చిరు, అశ్వనీదత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘చూడాలని వుంది!’ కూడా అదే బాట పట్టింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరుకి జోడీగా సౌందర్య, అంజలా జవేరి నటించగా… ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వేణు మాధవ్, అల్లు రామలింగయ్య, ఎం.ఎస్.నారాయణ, ధూళిపాళ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వేటూరి సుందరరామమూర్తి, చంద్రబోస్ రచించిన గీతాలకు… వీనుల విందైన బాణీలు అందించారు `మెలోడీ బ్రహ్మ` మణిశర్మ. “యమహా నగరి”, “రామా చిలకమ్మా”, “అబ్బబ్బా ఇద్దు”, “ఓ మారియా”, “సింబలే సింబలే”, “మనస్సా ఎక్కడున్నావ్”, .. ఇలా పాటలన్నీ విశేషాదరణ పొందాయి. అంతేకాదు… ఈ చిత్రానికిగానూ `ఉత్తమ సంగీత దర్శకుడు`గా `నంది` పురస్కారంతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు మణి. 1998 ఆగస్టు 27న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలచిన ‘చూడాలని వుంది!”… నేటితో 21 వసంతాలు పూర్తి చేసుకుంటోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: