హిట్ ఇచ్చిన డైరెక్టర్ కే నాని మళ్ళీ గ్రీన్ సిగ్నల్..!

2019 Latest Telugu Film News, Nani to Team Up With Shiva Nirvana Again, Nani Again With Shiva Nirvana, Shiva Nirvana to direct Nani again, Nani Latest Movie News, Nani Next With Shiva Nirvana, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘గ్యాంగ్ లీడర్’ రిలీజ్ కు సిద్ధమైంది. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా… హీరో కార్తికేయ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, ప్రియదర్శి, రఘు బాబు, వెన్నెల కిషోర్, సత్య ముఖ్య పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఏ సినిమా తర్వాత నాని ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం మరో సినిమాకు కూడా నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ కే మళ్ళీ ఓకే చెప్పాడంట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదు శివ నిర్వాణ. నిన్ను కోరి సినిమాతో హిట్ ఇవ్వడం..దీనికి తోడు ఈ ఏడాది ‘మజిలీ’ సినిమాతో మరోసారి తన సత్తా చూపించాడు. ఇకఇటీవలే నానీని దర్శకుడు శివ నిర్వాణ కలిసి ఒక కథ చెప్పాడట. ఆ కథ నానీకి బాగా నచ్చేసిందట. దానితో వెంటనే నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెబుతున్నారు. సాహు గారపాటి – హరీశ్ పెద్ది ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారని సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fourteen =