సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు మూవీ తో లేడీ అమితాబ్ విజయశాంతి రీ ఎంట్రీ అవుతున్న విషయం తెలిసిందే. విజయశాంతి ఒక కీలక పాత్రలోనటిస్తున్నసరిలేరు నీకెవ్వరు మూవీ 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఆ సినిమా రిలీజ్ కాకుండానే మరో మూవీ కి విజయశాంతి ఎంపికయ్యారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మెగా స్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సోషల్ డ్రామా మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో ఒక కీలక పాత్రకు విజయశాంతి ఎంపికయ్యారని సమాచారం. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభమయి 2020 ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ మూవీస్ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ రూపొందిందించిన దర్శకుడు కొరటాల శివ మరో మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. 10 సంవత్సరాల గ్యాప్ తరువాత చిరంజీవి నటించిన 150 వ మూవీ ఖైదీ నెం 150 ఘనవిజయం సాధించింది. చిరంజీవి 151 మూవీ గా రూపొందిన ప్రతిష్టాత్మక మూవీ సైరా నరసింహారెడ్డి రిలీజ్ కు సిద్ధం గా ఉంది. కర్తవ్యం మూవీ లో పెర్ఫార్మెన్స్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకొన్న విజయశాంతి రాములమ్మ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో రాములమ్మగా పేరుగాంచారు. కొరటాల శివ, చిరంజీవి, విజయ శాంతి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో చిరంజీవి 152 వ మూవీ రూపొందనుండటంలో ప్రేక్షక, అభిమానుల ఆనందానికి హద్దు లేదు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: