
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 10


అనుష్క లో నచ్చని ఒక క్వాలిటీ అదే..!

‘వి ఎపిక్’ లో ప్రత్యేకతలు ఎన్నో

బాలీవుడ్ లో బడా ఆఫర్ కొట్టేసిన కాజల్..!

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నాగ్!?

`ప్రతి రోజూ పండగే`కి రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందా?

రామోజీ ఫిల్మ్ సిటీలో ‘వి’

చిరు ‘ఖైదీ’ బాటలోనే కార్తి `ఖైదీ`

గ్యాంగ్ లీడర్ ట్రైలర్ రిలీజ్

మారిన వాల్మీకి రిలీజ్ డేట్

ప్రారంభం కానున్న ప్రభాస్ V ఎపిక్ థియేటర్

సాహో స్పెషల్ షోలకు గ్రీన్ సిగ్నల్

బల్గేరియాలో మొదలైన షెడ్యూల్..!

వార్ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్

సంచలన చిత్రం ‘రైతుబిడ్డ’కు 80 ఏళ్ళు

మ్యూజికల్ హిట్ ‘శీను’కి 20 ఏళ్ళు

ప్రభాస్ టీం లో టెక్ ఎక్స్పర్ట్ పోలీస్ గా దామిని చోప్రా..!
సాహో సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ తో పాటు దామిని చోప్రా అనే మరో బ్యూటీ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకరు యాక్షన్ తో ఆకట్టుకుంటే మరొకరు సినిమాలో గ్లామర్ తో రచ్చ చేయనున్నారన్నమాట. ఈ సినిమాలో ప్రభాస్ టీం లో టెక్ ఎక్స్పర్ట్ పోలీస్ గా ప్రీతీ అనే పాత్రలో నటిస్తుంది. హార్వర్డ్ యూనివర్సిటీ లో చదివిన దామిని చోప్రా అటు నటనతో పాటు పలు సామజిక పరిస్థితులపై ఆర్టికల్స్ రాయడమే కాదు.. పలు ఎన్జీవో సంస్థల్లో కూడా పని చేస్తూ తన వంతు తాను సాయం చేస్తుంది.

అనుష్క లో నచ్చని ఒక క్వాలిటీ అదే..!
ప్రభాస్, అనుష్క ఈ టాపిక్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ టాపిక్కే. బిల్లా సినిమా నుండి బాహుబలి వరకూ దాదాపు 10 ఏళ్ళ స్నేహం వీరిది. కానీ వీరిది స్నేహం కాదు.. అంతకుమించి ఏదో ఉందని అప్పటినుండి ఇప్పటివరకూ ఎన్నో వార్తలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. ఆ వార్తలు కాస్తా వెరీ పెళ్లి వరకూ కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ కి, అటు అనుష్క కి ప్రెస్ మీట్లలో వారి రిలేషన్ పై పలు ప్రశ్నలు ఎదురవ్వడం.. వాళ్ళు కూడా ఓపికగా సమాధానం చెప్పడం చూస్తూనే వున్నాం.

‘వి ఎపిక్’ లో ప్రత్యేకతలు ఎన్నో
భారీ బడ్జెట్ తో భారీ యాక్షన్స్ తో తెరకెక్కిన ప్రభాస్ సాహో రిలీజ్ అవ్వడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే వుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇక ఇప్పటికే సాహో తో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ప్రభాస్ మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్నాడు. అయితే ఈసారి సినిమాతో కాదు.. ‘వి ఎపిక్’ థియేటర్ తో. యు.వి.క్రియేషన్స్ అధినేతల్లో ఒకరైన నెల్లూరుకు చెందిన వేమారెడ్డి వంశీ ప్రధాన భాగస్వామిగా ప్రభాస్ ఈ మల్టీప్లెక్స్‌ను భారీ ఎత్తున నిర్మించిన సంగతి తెలిసిందే. ‘వి ఎపిక్’ పేరుతో ఉన్నఈ మల్టీప్లెక్స్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా సూళ్లురు పేటలో ప్రారంభం కానుంది. ‘సాహో’ సినిమాతోనే ‘వి ఎపిక్’ మల్టీప్లెక్స్ ఓపెన్…

బాలీవుడ్ లో బడా ఆఫర్ కొట్టేసిన కాజల్..!
ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్ళు అవుతున్నా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటుంది టాలీవుడ్ చందమామ కాజల్. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరో పక్క వేరే భాషల్లో కూడా సినిమా ఛాన్సులు కొట్టేస్తుంది. ఇప్పటికే తను నటించిన హిందీ క్వీన్ రీమేక్ 'పారిస్ పారిస్' సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇంకా కమల్-శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం `భారతీయుడు2`లో నటిస్తోంది. ఇదీ కాక శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సూర్యతో జతకట్టనుంది కాజల్.

'డిస్కో రాజా' ఫస్ట్ లుక్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
విఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరో గా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్చన్ ఫిల్మ్ 'డిస్కో రాజా'. గతంలో పలుమార్లు షూటింగ్ కి బ్రేక్ పడినట్లు పలురకాల రూమర్స్ వచ్చినప్పటికీ.. ఈ సినిమా ఇటీవల శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. నవంబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నాగ్!?
కామెడీ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుల్లో గోపీచంద్ మలినేని ఒకరు. ‘డాన్ శీను’, ‘బాడీగార్డ్’, ‘బలుపు’ వంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీస్‌తో అలరించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్... త్వరలో ‘కింగ్’ నాగార్జునతో జట్టుకట్టనున్నట్టు టాలీవుడ్ టాక్.

`ప్రతి రోజూ పండగే`కి రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందా?
`చిత్రలహరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత మెగా హీరో సాయితేజ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా `ప్రతి రోజూ పండగే`. సాయితేజ్‌కి జోడీగా రాశి ఖన్నా నటిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. మూడు తరాల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సత్యరాజ్, రావురమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రామోజీ ఫిల్మ్ సిటీలో ‘వి’
`అష్టా చమ్మా`, `జెంటిల్ మన్` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత కథానాయకుడు నాని, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా `వి`. నాని సిల్వర్ జూబ్లీ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు, అదితి రావ్ హైదరీ, నివేదా థామస్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత `దిల్` రాజు ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.

చిరు ‘ఖైదీ’ బాటలోనే కార్తి `ఖైదీ`
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రం `ఖైదీ`. 1983లో విడుదలైన ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్... చిరు కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిలచిపోయింది. ఇంకా చెప్పాలంటే...`ఖైదీ`కి ముందు, `ఖైదీ`కి తరువాత అన్నంతగా ఆ సినిమా మెగాస్టార్ కెరీర్‌పై ప్రభావం చూపించింది.
రాధా కృష్ణ తరువాత ప్రభాస్ శ్రీకాంత్ అడ్డాలతో నా సినిమా..!
ప్రస్తుతం ప్రభాస్ సాహో ప్రమోషన్ లో బిజీ గా వున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ రేంజ్ సాహో సినిమాతో ఆ రేంజ్ మరింత పెరిగిపోయింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. చిత్ర యూనిట్ కూడా ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది.

చిరంజీవి సినిమాల తేదీలను టార్గెట్ చేసిన హరీష్ శంకర్
`షాక్`(2006)తో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన హరీష్ శంకర్... `మిరపకాయ్` (2011)తో మొదటి విజయాన్ని అందుకున్నాడు. అయితే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో రూపొందించిన `గబ్బర్ సింగ్` (2012)తోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. కట్ చేస్తే... ఇప్పుడు వరుసగా మెగా కాంపౌండ్ హీరోలతో సినిమాలు చేస్తూ పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తున్నాడు హరీష్. ఆ మధ్య సాయితేజ్‌తో `సుబ్రమణ్యం ఫర్ సేల్` (2015), అల్లు అర్జున్‌తో `డీజే` (2017) రూపొందించిన హరీష్... ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో `వాల్మీకి` తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ 20న ఈ సినిమా తెరపైకి రానుంది.

గ్యాంగ్ లీడర్ ట్రైలర్ రిలీజ్
విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది. దీనిలో భాగంగానే ఇప్పటికే పాటలు, టీజర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మారిన వాల్మీకి రిలీజ్ డేట్
హరీష్ శంకర్ దర్శకత్యంలో వాల్మీకి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాను మొదట సెప్టెంబర్ 6న రిలీజ్ చేద్దామనుకున్నారు... కానీ అయితే మళ్లీ రిలీజ్ డేట్ ను మార్చారు. సెప్టెంబర్ 13వ తేదీకి మార్చారు. అయితే మళ్ళీ ఏమైందో తెలియదు కానీ రిలీజ్ డేట్ మార్చారు. వారం రోజులు వాయిదా వేశారు. సెప్టెంబర్ 20 వ తేదీన రిలీజ్ చేయనున్నారు చిత్ర యూనిట్. ఇక సెప్టెంబర్ 13వ తేదీన గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

ప్రారంభం కానున్న ప్రభాస్ V ఎపిక్ థియేటర్
ప్రభాస్ V ఎపిక్ మల్టీ ప్లెక్స్ సూళ్లూరు పేట లో ప్రారంభం కానుంది. మూడు ఎకరాలలో నిర్మించిన మల్టీ ప్లెక్స్ లో అత్యాధునిక సాంకేతికత తో రూపొందిన మూడు స్క్రీన్స్ ఉన్నాయి. గేమింగ్ జోన్, షాపింగ్ సెంటర్ ఏర్పాటుచేశారు. ఒక థియేటర్ స్క్రీన్ 100అడుగులు ఎత్తు, 54 అడుగుల వెడల్పు తో ఉంది. ఈ స్క్రీన్ ఆసియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్. 656 సీటింగ్ కెపాసిటీ, 4K రిజల్యూషన్ తో ప్రదర్శన ఉంటుంది.

సాహో స్పెషల్ షోలకు గ్రీన్ సిగ్నల్
ఇంకా రెండు రోజుల్లో సినీ లవర్స్ ఎంతగానో ఎంతగానో ఎదురుచూస్తున్న సాహో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు సినిమాల్లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా ఆ సినిమాకు ఇంత రేంజ్ లో ప్రమోషన్ కార్యక్రమాలు జరగలేదు. ఇక ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక సాహో టీం కూడా ఎక్కడా తగ్గకుండా రోజుకో అప్డేట్ ఇస్తూనే ఉంది. పాటలు, పోస్టర్లు ఇలా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ సర్ ప్రయిజ్ లు ఇస్తున్నారు ఫ్యాన్స్ కు. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది సాహో.

బల్గేరియాలో మొదలైన షెడ్యూల్..!
రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. తాజాగా ఈ సినిమా మరో షెడ్యూల్ ను 'బల్గేరియా'లో ప్లాన్ చేశారు. దీనిలో భాగంగానే ఈ రోజునే అక్కడ షూటింగ్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారట. ఈ సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు.

వార్ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్
యాక్షన్ హీరోలు హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘వార్’. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అత్యద్భుత ఫైటింగ్ సన్నివేశాలతో.. బైక్‌లు, హెలికాప్టర్లు, కార్లతో చేజింగ్ సీన్లు థ్రిల్ పుట్టించాయి. యాక్షన్ హీరోలు ఇద్దరూ తమ స్టంట్ స్కిల్స్‌తో దుమ్మురేపారు. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. గాంధీ జయంతి రోజు (అక్టోబర్ 2) న 'వార్' ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంచలన చిత్రం ‘రైతుబిడ్డ’కు 80 ఏళ్ళు
తెలుగునాట పలు రైతు కథా చిత్రాలు వచ్చాయి. అయితే... ఆ తరహా సినిమాలకు బీజం వేసిన చిత్రంగా `రైతుబిడ్డ`(1939)కి ప్రత్యేక స్థానం ఉంది. “వచ్చేది రైతు రాజ్యం, ఏలేది రైతు సంఘం” అన్న నినాదంతో ఈ సినిమా తెరకెక్కింది. భారతదేశాన్ని బ్రిటీష్ ప్రభుత్వం ఏలుతున్న కాలంలో సామాజిక సంస్కరణ వాద చిత్రంగా `రైతుబిడ్డ` రూపొందింది. జమీందారీ వ్యవస్థపై పోరు సాగుతున్న ఆ కాలంలో... ఈ చిత్రాన్ని సారథి ఫిలిమ్స్ లిమిటెడ్ పతాకంపై చల్లపల్లి మహారాజ అనే జమీందార్ నిర్మించడం విశేషం. అలాగే... ‘మాలపిల్ల’ వంటి సామాజిక చిత్రాన్ని తెరకెక్కించిన గూడవల్లి రామబ్రహ్మం... ‘రైతుబిడ్డ’కు దర్శకత్వం వహించడం మరో విశేషం.

రిలీజయిన క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సమకాలీన రాజకీయాలు నేపథ్యంలో కమ్మ రాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లోని రెండవ సాంగ్ క్యాస్ట్ ఫీలింగ్ ఈ రోజు 9:27 AM కు రిలీజయింది . కులాభిమానం కలిగిన ప్రతీ వారికీ ఈ సాంగ్ ను అంకితం చేస్తున్నానని ట్వీట్ చేసి , క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్ వీడియో ను వర్మ ట్విట్టర్ లో షేర్ చేశారు.

మ్యూజికల్ హిట్ ‘శీను’కి 20 ఏళ్ళు
విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘శీను’ ఒకటి. ‘సూర్యవంశం’, ‘రాజా’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థలో వెంకటేష్ నటించిన సినిమా ఇది. తమిళ చిత్రం ‘సొల్లమాలే’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి శశి (`బిచ్చగాడు` ఫేమ్) దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ బ్యూటీ ట్వింకిల్ ఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ఆనంద్, సుధాకర్, అలీ, బ్రహ్మానందం, చంద్రమోహన్, చారు హాసన్, బ్రహ్మాజీ, ఉత్తేజ్, వర్ష, శివపార్వతి తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. అందాల తార రాశి ప్రత్యేక గీతంలో దర్శనమిచ్చింది.