పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్ జులై నెలలో రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లవర్ బాయ్. పక్కింటి కుర్రాడు వంటి రోల్స్ లో నటించే రామ్ ఈ మూవీ లో పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించి, తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూరి జగన్నాథ్ స్టోరీ, రామ్ ఎనర్జీ చిత్ర విజయానికి ప్లస్ అయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ మూవీ హిందీ, తమిళ రీమేక్ లకు పోటీ ఏర్పడింది. తమిళ స్టార్ హీరో ధనుష్ ఇస్మార్ట్ శంకర్ తమిళ రీమేక్ మూవీ లో హీరోగా నటిస్తారని తాజా సమాచారం. అనేక తమిళ మూవీస్ లో మాస్ క్యారెక్టర్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ధనుష్ ఈ మూవీ కి సూట్ అవుతారనే అభిప్రాయంతో రీమేక్ రైట్స్ పొందిన నిర్మాతలు
ధనుష్ ను సంప్రదిస్తున్నారని సమాచారం. ధనుష్ అంగీకరిస్తే మరో పక్కా మాస్ క్యారెక్టర్ తో తమిళ ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది .
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: