ఇటీవలే హిప్పీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా నటి దిగంగనా సూర్యవన్షీ. ఆ సినిమా ఫలితం ఎలా వున్నా.. ఈ అమ్మడికి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇప్పడు మరో కొత్త సినిమాతో రాబోతుంది. లక్ష్, దిగంగనా సూర్యవన్షీ హీరోహీరోయిన్లుగా రమేశ్ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత పద్మావతి చదలవాడ మాట్లాడుతూ.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో సమాజంలోని ఓ అంశాన్ని తీసుకుని కొత్త తరహా ప్రేమ కథా చిత్రంగా రూపొందిస్తున్నామని తెలియజేశారు. ఈనెలలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తామని చెప్పారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఇంకా ఈ సినిమాలో ఈ సినిమాలో రవిప్రకాశ్, రవి వర్మ, నోయెల్ సేన్, చిత్రం శ్రీను తదితరులు నటించనున్నారు. ఈ సినిమాను శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామకృష్ణ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. గతంలో ఈ బ్యానర్ పై ”బిచ్చగాడు, ‘డి16’, ‘టిక్ టిక్ టిక్’ వంటి చిత్రాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలకు కూడా మంచి ఫలితాలే దక్కాయి. దీనితో ఈ సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: