బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించిన రెండు మూవీస్ ఒక వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ కానున్నందున మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. భారీ బడ్జెట్, భారీ తారాగణం తో ప్రభాస్ హీరో గా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30వ తేదీ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో గా హిందీ లో రూపొందిన రొమాంటిక్ కామెడీ డ్రామా చిచ్చోరే మూవీ సెప్టెంబర్ 6వ తేదీ రిలీజ్ కానున్నాయి. ఈ రెండు మూవీస్ ప్రమోషన్స్ లో శ్రద్ధా బిజీగా ఉన్నారు. బాఘీ3 మూవీ కి కమిట్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రద్ధాకపూర్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. రెండు సంవత్సరాలుగా సాహో మూవీ కి వర్క్ చేశానని, ఆ మూవీ రిలీజ్ గురించి నిజంగా నెర్వస్ గా ఫీల్ అవుతున్నానని ,, ఈ రోజుల్లో బడ్జెట్, ఆర్టిస్ట్ లతో సంబంధం లేకుండా మూవీ నచ్చితేనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, ప్రేక్షకులే న్యాయ నిర్ణేతలని, ప్రేక్షకుల ను అలరించేలా మూవీ స్టోరీ లో భాగంగా ఉండాలనికోరుకుంటానని, ఛాలెంజింగ్ రోల్స్ లో నటించడానికి ఇష్టపడతానని, మానసిక ఒత్తిడి , ఆందోళనలకు మెడిటేషన్ తో ఊరటపొందుతున్నానని, ఆహరం, ఎక్సర్ సైజ్ లపై శ్రద్ధ తీసుకుంటున్నానని శ్రద్ధా కపూర్ తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























