‘ఆర్ ఆర్ ఆర్’… కొమరం భీమ్ ఫస్ట్ లుక్ అప్‌డేట్‌

2019 Latest Telugu Film News, Jr NTR First Look Update From RRR Movie, Jr NTR First Look from New Movie, Jr NTR First Look from Rajamouli RRR, RRR Movie Movie Latest News, First Look RRR Movie, RRR Movie Movie First Look, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood cinema News

వాస్తవిక పాత్రలు, కల్పిత ఘటనలతో రూపొందుతున్న పేట్రియాటిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ మధ్య చిగురించిన స్నేహం… ఒకరి జీవితంపై మరొకరి ప్రభావం అనే ఆసక్తికరమైన అంశాలతో దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్… అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన చిత్రీకరణ బల్గేరియాలో జరుగుతోంది. కొమరం భీమ్‌ పాత్రధారి తారక్ పై కొన్ని కీలక ఘట్టాలను అక్కడ పిక్చరైజ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… అక్టోబర్ 22 కొమరం భీమ్ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ రోజు ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఏదిఏమైనా… ఈ ఫస్ట్ లుక్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

ప్రముఖ నిర్మాత డి.వి.వి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి బాణీలు అందిస్తున్నాడు.

కాగా… 2020 జూలై 30న ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =