2007లో తన స్వీయ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ముని అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు లారెన్స్. సూపర్ హిట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ముని సిరీస్ లో భాగంగా ఇప్పటివరకు కాంచన, గంగ, కాంచన 3 తెరకెక్కించి హిట్ లు కొట్టారు. ఇక కాంచన సినిమాను లారెన్స్ హిందీలో కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘లక్ష్మీబాంబ్’ పేరుతో రీమేక్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కియరా అద్వానీ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని 2020 మే 22వ తేదీన ఈ సినిమా విడుదల చేయనున్నారు. ఇక ‘లక్ష్మీబాంబ్’ సినిమాకు దర్శకత్వం వహించటానికి లారెన్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా చేసాడట. ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్ – కియరా అద్వానీ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కూడా చాల ఫన్నీగా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు షబీనా ఖాన్, తుషార్ కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మరి చూద్దాం ఇక్కడ అయితే ఈ సినిమా మంచి హిట్ అయింది. మరి హిందీ ప్రేక్షకులకు ఎంత వరకూ నచుతుందో చూద్దాం.
ప్రస్తుతం అక్షయ్ ‘హౌస్‌ఫుల్ 4’, ‘గుడ్ న్యూస్’ సినిమాలు కూడా చేస్తున్నాడు. ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా పూర్తిస్థాయి హాస్యభరితంగా రూపొందిస్తున్నారు. ‘గుడ్‌న్యూస్’ లో కరీనా కపూర్, దిల్జిత్ దొసాంజే నటిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: