సెప్టెంబర్ తొలి వారం నుండి ‘వెంకీమామ’ తాజా షెడ్యూల్‌?

2019 Latest Telugu Film News, New Schedule For Venky Mama Movie, New Schedule Starts from September For Venky Mama, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Venkatesh Daggubati Ready For Venky Mama Movie New Schedule, Venky Mama Movie Latest Movie News, Venky Mama Movie New Schedule, Venky Mama Movie New Schedule Starts from September

రియ‌ల్ లైఫ్ మేనమామ – మేనల్లుళ్ళు విక్ట‌రీ వెంకటేష్, యువ సామ్రాట్‌ నాగ చైతన్య… రీల్ లైఫ్‌లోనూ అవే పాత్రల్లో న‌టిస్తున్న చిత్రం `వెంకీమామ‌`. హిలేరియ‌స్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో పాయ‌ల్ రాజ్‌పుత్, రాశీ ఖ‌న్నా క‌థానాయికలుగా నటిస్తున్నారు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని డి.సురేశ్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఆ మ‌ధ్య పాట చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా వెంకీ కాలు బెణ‌క‌డంతో… షూటింగ్‌కి తాత్కాలికంగా బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం వెంకీ గాయం నుంచి కోలుకోవ‌డంతో… సెప్టెంబర్ మొదటి వారం నుంచి మ‌ళ్ళీ షూటింగ్‌ను ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నట్టు స‌మాచారం. కాగా… వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 2న‌ టీజ‌ర్‌ని, దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 25న సినిమాని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు టాక్‌. త్వ‌ర‌లోనే టీజ‌ర్, రిలీజ్ డేట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 8 =