గ్యాంగ్ లీడర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

#GangLeader, Gang Leader Trailer Release Date, Nani Gang Leader Movie Latest News, Nani Gang Leader Trailer, Nani Gang Leader Trailer Out, Nani Gang Leader Trailer released Date Announced, Nani Gang Leader Trailer Released Date Fixed, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News, Gang Leader Trailer Release Date Locked
Gang Leader Trailer Release Date Locked

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరో గా ‘గ్యాంగ్ లీడర్’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఆగష్ట్ 30వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా… సాహో రిలీజ్ ఉండటంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకున్నారు. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ నెల 28వ తేదీన .. ఉదయం 11 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. దానితో పాటు ఈ నెల 30వ తేదీన విడుదలయ్యే ‘సాహో’ సినిమాతో పాటు ఈ ట్రైలర్ ప్రేక్షకులను పలకరించనుంది.

కాగా ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. హీరో కార్తికేయ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, ప్రియదర్శి, రఘు బాబు, వెన్నెల కిషోర్, సత్య ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా… పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. మరి జెర్సీ సినిమాతో హిట్ కొట్టిన నానికి ఈ సినిమా మరో హిట్ అందిస్తుందేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 9 =