ట్యాగ్ · 25 కథనాలు
తెలంగాణ యాసలో నాని..!

తన లవ్ స్టోరీ గురించి చెప్పిన రానా...!

నాకు టైమ్ ఉందిలే.. రానా, నితిన్ ఏం చేశారు...!
బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ప్రభాస్ మూవీ

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నాని మూవీ
మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ మృతి
ఆలోచన రేకెత్తించే రష్మిక పోస్ట్

హ్యాపీ బర్త్ డే మామయ్య..!
హీరోయిన్ రెజీనా ?
కన్ఫామ్.. స్టార్ హీరోతో నెక్స్ట్ సినిమా
బిజీ యంగ్ హీరో నాగశౌర్య
జూన్ నుండి షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్..!
"చంద్రముఖి 2" మూవీ లో సిమ్రాన్ ?
సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు మృతి

నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్’కు 34 ఏళ్ళు
అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’కు ఆరేళ్ళు
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్?
అగ్ర యువ కథానాయకుడితో శేఖర్ కమ్ముల చిత్రం
సంక్రాంతి బరిలో సినిమాలు
తెలుగు రాష్ట్రాలలో రిలీజయ్యే సినిమాలకు సంక్రాంతి పండగ పెద్ద సీజన్. సంక్రాంతి పండగకు రిలీజ్ అయిన సినిమాలు మంచి కలెక్షన్స్ రాబడతాయి. అందుకే నిర్మాతలు తమ మూవీస్ ను సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతారు. 2020 సంవత్సరం సంక్రాంతికి "సరిలేరు నీకెవ్వరు ", "అల .. వైకుంఠపురములో .. ", "ఎంత మంచివాడవురా ""దర్బార్ "డబ్బింగ్ మూవీ రిలీజ్ అయ్యాయి. "సరిలేరు నీకెవ్వరు ", "అల .. వైకుంఠపురములో .. " మూవీస్ ఘనవిజయం సాధించి రికార్డ్ కలక్షన్స్ రాబట్టాయి. 2021 సంవత్సరంలో కూడా 3స్ట్రెయిట్ , ఒక డబ్బింగ్ మూవీ సంక్రాంతి బరిలో ఉన్నాయి.
తెలంగాణ యాసలో నాని..!
వరుస సినిమాలను కమిట్ అవుతూ ఫుల్ బిజీ అవ్వనున్నాడు న్యాచురల్ స్టార్ నాని. వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఒక్కసారి లాక్ డౌన్ కనుక తీసేస్తే షూటింగ్ లతో బిజీ కానున్నాడు. ఇప్పటికే ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమా చేసాడు. సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితీరావ్ హైదరీ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా లాక్ డౌన్ వల్ల ఆగింది. ఆ సినిమా చేస్తూనే నానితో ‘నిన్ను కోరి ' తెరకెక్కించిన శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ రీతూవర్మ తో పాటు మరో హీరోయిన్ గా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. ఆతర్వాత 'టాక్సీవాలా' సినిమా…

తన లవ్ స్టోరీ గురించి చెప్పిన రానా...!
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లిస్ట్ లో ఒకప్పుడు మొదట వినిపించిన పేరు రానా. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ నుండి బయటకి వచ్చేశాడు. సోషల్ మీడియా లో తన ప్రేమను బయట పెట్టడం.. చెప్పిన కొద్దీ రోజులకే ఎంగేజ్ మెంట్ కూడా చేసుకోవడం అన్నీ చక చకా జరిగిపోయాయి. అయితే వీరి ఎంగేజ్ మెంట్ అయినా కూడా అసలు రానా-మిహికా ల మధ్య ప్రేమ ఎలా స్టార్ట్ అయింది అన్న విషయాల్లో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు చాలా మందికి. ఎందుకంటే రానా ఏమో హీరో, మిహికా ఏమో ముంబైలో డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరిట ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్, డెకరేషన్ సంస్థను నడుపుతోంది.మరి వీరిద్దరి ప్రేమ ఎలా మొదలైంది విషయాలు రానానే చెప్పాడు .

నాకు టైమ్ ఉందిలే.. రానా, నితిన్ ఏం చేశారు...!
మెగా హీరోలు సాయి తేజ్, వరుణ్ తేజ్ ల ఫన్నీ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొద్దిరోజుల కిందట నాగబాబు ఒక ఇంటర్వ్యూ లో నిహారిక, వరుణ్ పెళ్లిళ్ల గురించి చెప్పిన సంగతి గుర్తుండేవుంటుంది కదా. వచ్చే ఏడాది నిహారిక పెళ్లి ఉంటుందని.. ఆ తర్వాత వరుణ్ పెళ్లి కూడా తొందరలోనే చేస్తామని.. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే నా భాద్యత అయిపోతుంది.. వచ్చే వాళ్ళను వాళ్ళని చుస్కుకుంటారు అని చెప్పారు. ఇక వీడియో ను సాయి తేజ్ ఇప్పుడు చూసాడేమో కానీ ఆ వీడియోను పోస్ట్ చేస్తూ ఏంటి బావ నీకు పెళ్ళంటా? అని తేజ్, వరుణ్ ని అడిగాడు.
బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ప్రభాస్ మూవీ
వైజయంతి మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక మూవీ కి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ మూవీ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ హీరోగా రూపొందిన "బాహుబలి" ,"బాహుబలి 2" , "సాహో " మూవీస్ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించాయి. ఈ మూవీస్ తో బాలీవుడ్ లో ప్రభాస్ మూవీస్ పై క్రేజ్ పెరిగింది. దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నాని మూవీ
హీరో నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత "టాక్సీవాలా " మూవీ ఫేమ్ రాహుల్, "బ్రోచేవారెవరురా " మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించే చిత్రాలలో నాని నటించనున్నారు. నాని ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ మృతి
ఈరోజు ఉదయమే సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేశ్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. హరికిషన్ మరణం పట్ల టాలీవుడ్ సంతాపం వ్యక్తం చేసింది.
ఆలోచన రేకెత్తించే రష్మిక పోస్ట్
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కన్నడ బ్యూటీ రష్మిక కరోనా లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయ్యి సోషల్ మీడియా లో యాక్టివ్ గా వుంటున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో ఫోటోలు, వీడియో లు షేర్ చేస్తూ రష్మిక టైమ్ పాస్ చేస్తున్నారు. ఇప్పుడు రష్మిక ఆలోచన రేకెత్తించే ఒక పోస్ట్ ను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.

హ్యాపీ బర్త్ డే మామయ్య..!
కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్. కమర్షియల్ సినిమాలే కాదు భక్తిరస సినిమాలు తీయడంలో కూడా ఆయనకు ఆయనే సాటి. మేకింగ్‌లో వెరైటీ. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ఆయన రూటే సెపరేటు. ఇక హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా.. ఇంకెవరూ కే.రాఘవేంద్రరావు. ఇక తెలుగులో ఎన్నో సంచలనాలు సృష్టించిన రాఘవేంద్రరావు పుట్టిన రోజు ఈ రోజు. దీనితో టాలీవుడ్ నుండి పలువురు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
హీరోయిన్ రెజీనా ?
పలు హిట్ చిత్రాలలో నటించిన రెజీనా టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రెజీనా నటించిన "ఎవరు" మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రెజీనా ప్రస్తుతం 4 తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య " మూవీ లో ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.
కన్ఫామ్.. స్టార్ హీరోతో నెక్స్ట్ సినిమా
టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్స్ లో శేఖర్ కమ్ముల కాస్త డిఫరెంట్ అని చెప్పొచ్చు. పెద్ద ఫైట్లు, కమెర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకుండా.. మంచి ఫీల్ గుడ్ మూవీస్ తీయడంలో దిట్ట. 'డాలర్ డ్రీమ్స్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైనా.. 'ఆనంద్' సినిమాతో మంచి సక్సెస్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'హ్యాపీడేస్', 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, 'లీడర్'' వంటి విజయాలను అందుకున్న తర్వాత 'అనామిక' సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు. గత ఏడాది విడుదలైన 'ఫిదా' చిత్రంతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు శేఖర్.
బిజీ యంగ్ హీరో నాగశౌర్య
"ఊహలు గుస గుసలాడే , "జో అచ్యుతానంద ", "ఛలో ", "కణం ", "ఓ బేబీ " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో నాగశౌర్య ప్రేక్షకులను అలరించారు. హీరో నాగశౌర్య తో జంటగా నటించి టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా , రష్మిక లు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా రాణించడం విశేషం. నాగశౌర్య స్వంత ప్రొడక్షన్ హౌస్ ఐరా క్రియేషన్స్ పై "ఛలో ", "నర్తనశాల ", "అశ్వథ్థామ" మూవీస్ నిర్మించారు. "అశ్వథ్థామ"మూవీ లో మాస్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాగశౌర్య ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.
జూన్ నుండి షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్..!
లాక్‌డౌన్‌తో బుల్లితెర, వెండితెర షూటింగ్స్ నుంచి ప్రొడక్షన్, ఇతర కార్యక్రమాలు అన్నీ నిలిచిపోయాయి. ఒకపక్క పక్క రాష్ట్రాల్లో షూటింగ్ లకు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో ఇక్కడ కూడా అనుమతుల కోసం టాలీవుడ్ పెద్దలు ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, ఎన్.శంకర్, అల్లు అరవింద్, దిల్ రాజు, రాధాకృష్ణ, సీ. కల్యాణ్, సురేష్‌బాబు, కొరటాల శివ తదితరలు ప్రగతిభవన్‌కు వెళ్లి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో చర్చలు జరిపారు.
"చంద్రముఖి 2" మూవీ లో సిమ్రాన్ ?
శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి . వాసు దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా రూపొందిన కామెడీ హారర్ తమిళ మూవీ "చంద్రముఖి "ఘనవిజయం సాధించింది. ప్రభు , జ్యోతిక, నయనతార ఇతర ముఖ్య తారాగణం. 2005 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ "చంద్రముఖి " కూడా ఘనవిజయం సాధించింది. "చంద్రముఖి" మూవీ లో గంగ, చంద్రముఖి పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జ్యోతిక బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ రూపొందనుంది.
సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు మృతి
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ్ వెంకటేశ్ గుండెపోటుతో మృతి చెందారు. చెనై అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో డాక్టర్‌గా పనిచేస్తున్న అభినయ్ నిద్రలో గుండెపోటు రావడంతో మృతి చెందినట్టు చెపుతున్నారు. తన ప్యాలెస్ పనుల నిమిత్తం నిన్న చెంగల్పట్టుకు వెళ్లి..అక్కడ కుటుంబంతో సరదాగా గడిపాడని..ఉదయం కల్లా ఇంత ఘోరం జరిగిందని సన్నిహితులు తెలిపుతున్నారు. చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్’కు 34 ఏళ్ళు
ఒక మహానటుడు తనయుడు కథానాయకుడిగా తెరంగేట్రం చేస్తున్నాడంటే.. ఆ అంచనాలు భారీగా ఉంటాయి. అందునా.. ఆ కథానాయకుడు నటించబోయే సినిమా.. పరభాషలో ఘనవిజయం సాధించిన చిత్రమైతే.. ఇక ఆ అంచనాలకు ఆకాశమే హద్దు. అయితే, ఆ అంచనాలకు తగ్గట్టుగా తొలిచిత్రంతోనే మరపురాని విజయాన్ని అందుకుని.. అంచెలంచెలుగా ఎదిగి.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు ఆ కథానాయకుడు. అతను మరెవరో కాదు.. ‘కింగ్’ నాగార్జున. ఆ చిత్రమే.. ‘విక్రమ్’.
అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’కు ఆరేళ్ళు
ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు ఒకే సినిమాలో కలసి నటించడం అరుదైన విషయమనే చెప్పాలి. అలాంటి అరుదైన అంశానికి వేదికగా నిలిచిన చిత్రం ‘మనం’. అక్కినేని మూడు తరాల కథానాయకులైన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, ‘కింగ్’ నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మెమరబుల్ మూవీని విక్రమ్ కె.కుమార్ డైరెక్ట్ చేశాడు. నాగ్‌కి జోడిగా శ్రియాశరన్, చైతూకి జంటగా సమంత నటించిన ఈ సినిమాలో శరణ్య, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మానందం, సప్తగిరి, యం.యస్.నారాయణ, జయప్రకాష్ రెడ్డి, చలపతిరావు, పోసాని కృష్ణమురళి, శంకర్ మేల్కోటే, కృష్ణుడు, గుండు సుదర్శన్ ముఖ్య భూమికలు పోషించగా.. అమల…

మహేష్ బాబుకి 'ఉత్తమ నటుడు'గా తొలి ‘నంది’ని అందించిన ‘నిజం’కి 17 ఏళ్ళు
తెలుగునాట ప్రయోగాలకు పెద్ద పీట వేసే కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. అలా మహేష్ నటించిన ప్రయోగాత్మక చిత్రాలకు సంబంధించి జయాపజయాలను పక్కన పెడితే.. కొన్ని చిత్రాలు మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అలా.. ప్రశంసలు అందుకున్న చిత్రాల్లో 'నిజం' ఒకటి. 'యాంటి కరప్షన్' బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంచలన దర్శకుడు తేజ రూపొందించాడు. ఇందులో రక్షిత కథానాయికగా నటించగా గోపీచంద్, రాశి, ‘తాళ్ళూరి’ రామేశ్వరి, ప్రకాష్‌రాజ్, రంగనాథ్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజీ, జీవా, కాంతారావు, విజయచందర్, రాళ్ళపల్లి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కొండవలస లక్ష్మణరావు, షకీలా, సుమన్ శెట్టి, మణిచందన ముఖ్య…
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్?
గత ఏడాది విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేశాడు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ప్రస్తుతం యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఓ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు పూరి. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. కాగా, వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అగ్ర యువ కథానాయకుడితో శేఖర్ కమ్ముల చిత్రం
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్స్కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీడేస్’, ‘ఫిదా’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల.. త్వరలో ‘లవ్ స్టోరీ’తో పలకరించనున్నాడు. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, డ్యాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా.. చిత్రీకరణ తుదిదశలో ఉంది.