హ్యాపీ బర్త్ డే మామయ్య..!

Super Star Mahesh Babu Greets Birthday Wishes To Legendary Director K Raghavendra Rao On Twitter
Super Star Mahesh Babu Greets Birthday Wishes To Legendary Director K Raghavendra Rao On Twitter

కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్.  కమర్షియల్ సినిమాలే కాదు భక్తిరస సినిమాలు తీయడంలో కూడా ఆయనకు ఆయనే సాటి. మేకింగ్లో వెరైటీ. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో ఆయన రూటే సెపరేటు. ఇక హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా.. ఇంకెవరూ కే.రాఘవేంద్రరావు. ఇక తెలుగులో ఎన్నో సంచలనాలు సృష్టించిన రాఘవేంద్రరావు పుట్టిన రోజు ఈ రోజు. దీనితో టాలీవుడ్ నుండి పలువురు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా ఆయనకు తన ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు. రాజకుమారుడు సినిమా సమయంలోని అప్పటి లొకేషన్ పిక్ ను పోస్ట్ చేసి.. మీ లాంటి జీనియస్ డైరెక్టర్ తో పనిచేసిన గొప్ప అనుభూతి ఎప్పటికీ మరిచిపోలేను అని…మీరు ఎప్పుడూ సంతోషంగా.. ఆరోగ్యగంగా ఉండాలని కోరుకుంటున్న అని తెలిపాడు. 1999లో మహేష్ హీరోగా డెబ్యూ మూవీ రాజకుమారుడు సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వహించిన సంగతి తెలిసిందే.

రాఘవేంద్రరావు 1942 మే 23వ తేదిన కృష్ణా జిల్లా , కంకిపాడు మండలం, కోలవెన్ను గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి కె.యస్. ప్రకాష్ రావు కూడా పెద్ద డైరెక్టర్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + four =