మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ మృతి

Veteran Mimicry Artist Hari Kishan Passes Away
Veteran Mimicry Artist Hari Kishan Passes Away

ఈరోజు ఉదయమే సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేశ్ గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. హరికిషన్ మరణం పట్ల టాలీవుడ్ సంతాపం వ్యక్తం చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1963 మే 30న ఏలూరులో రంగమణి, వీఎల్ఎన్ చార్యులు దంపతులకు హరికిషన్ జన్మించారు. చిన్నప్పటినుండే ఆయన మిమిక్రీ చేయడం నేర్చుకున్నారు. పలువురు సినీ, రాజకీయ నాయకులు వాయిస్‌ను మిమిక్రీ చేయడంలో అయన ప్రావీణ్యుడు. అంతేకాదు.. పక్షులు, యంత్రాలు చేసే శబ్ధాలు, సంగీత వాద్య పరికరాల సౌండ్స్‌ను తన గొంతులో పలకించడం హరి కిషన్ ప్రత్యేకత. పలు సినిమాలు, టీవీ షోల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు.. అంతేకాదు దేశ విదేశాల్లో 10 వేలకు పైగా మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చారు. 12 ఏళ్ల పాటు టీచర్‌గా పనిచేసిన హరికిషన్.. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ లెక్చరర్‌గా పనిచేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =