నాకు టైమ్ ఉందిలే.. రానా, నితిన్ ఏం చేశారు…!

Sai Tej and Varun Tej Engage In Fun Banter With Each Other On Social Media

మెగా హీరోలు సాయి తేజ్, వరుణ్ తేజ్ ల ఫన్నీ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొద్దిరోజుల కిందట నాగబాబు ఒక ఇంటర్వ్యూ లో నిహారిక, వరుణ్ పెళ్లిళ్ల గురించి చెప్పిన సంగతి గుర్తుండేవుంటుంది కదా. వచ్చే ఏడాది నిహారిక పెళ్లి ఉంటుందని.. ఆ తర్వాత వరుణ్ పెళ్లి కూడా తొందరలోనే చేస్తామని.. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే నా భాద్యత అయిపోతుంది.. వచ్చే వాళ్ళను వాళ్ళని చుస్కుకుంటారు అని చెప్పారు. ఇక వీడియో ను సాయి తేజ్ ఇప్పుడు చూసాడేమో కానీ ఆ వీడియోను పోస్ట్ చేస్తూ ఏంటి బావ నీకు పెళ్ళంటా? అని తేజ్, వరుణ్ ని అడిగాడు.

ఇక ఈ ట్వీట్ పై వరుణ్ తేజ్ కూడా కామెడీ గా స్పందించాడు. దానికి ఇంకా చాలా సమయం ఉందిలే కానీ మన రానా దగ్గుబాటి, నితిన్ మీతోనే ఉంటాం అని చెప్పి.. సింపుల్ గా సింగిల్స్ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయిపోయారు అంటూ కామెడీ చేసాడు. మరి దీనికి సాయి తేజ్ ఏం రిప్లై ఇస్తాడో చూడాలి.

కాగా టాలీవుడ్ లో వున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ లిస్ట్ లో మొన్నటి వరకూ నితిన్, రానా పేర్లు వినిపించేవి. నితిన్ కు ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. లాక్ డౌన్ లేకపోతే ఇప్పటికే పెళ్లి కూడా అయిపోయేది. ఇక రానా కూడా బ్యాచ్ లర్ లిస్ట్ నుండి బయటకు వచ్చేసాడు. అలా తన ప్రేమను బయటపెట్టాడో.. అప్పుడే ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు. మరి చూద్దాం సాయి తేజ్, వరుణ్ లు ఈలిస్ట్ ల నుండి ఎప్పుడు బయటకు వస్తారో..

ఇక వరుణ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ బేస్డ్ మూవీ చేస్తున్నారు. సాయి ధరమ్ సుబ్బు దర్శకుడిగా సోలో బ్రతుకే సో బటర్ అనే మూవీ చేస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here