తెలుగు రాష్ట్రాలలో రిలీజయ్యే సినిమాలకు సంక్రాంతి పండగ పెద్ద సీజన్. సంక్రాంతి పండగకు రిలీజ్ అయిన సినిమాలు మంచి కలెక్షన్స్ రాబడతాయి. అందుకే నిర్మాతలు తమ మూవీస్ ను సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతారు. 2020 సంవత్సరం సంక్రాంతికి “సరిలేరు నీకెవ్వరు “, “అల .. వైకుంఠపురములో .. “, “ఎంత మంచివాడవురా “”దర్బార్ “డబ్బింగ్ మూవీ రిలీజ్ అయ్యాయి.
“సరిలేరు నీకెవ్వరు “, “అల .. వైకుంఠపురములో .. ” మూవీస్ ఘనవిజయం సాధించి రికార్డ్ కలక్షన్స్ రాబట్టాయి. 2021 సంవత్సరంలో కూడా 3స్ట్రెయిట్ , ఒక డబ్బింగ్ మూవీ సంక్రాంతి బరిలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ “, కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED”, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ “, బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “మాస్టర్ “డబ్బింగ్ మూవీ సంక్రాంతి పండగకు రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం ఈ 4 మూవీస్ సంక్రాంతి బరిలో ఉన్నాయి.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: