కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Movies News

ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

మామయ్య పై వస్తున్న వార్తలు నిజమే.. కానీ..!

సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అనారోగ్యానికి గురయ్యారని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని గ్యాస్ట్రో ఎంటరాలజీలో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స చేస్తున్నారన్న వార్తలు వినిపించాయి. అయితే మరోవైపు ఈ వార్తల్లో నిజం లేదు.. కేవలం పుకార్లు అన్న మాట కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో దీనిపై నటుడు ఉత్తేజ్ స్పందించి... సుద్దాల అశోక్ తేజ అనారోగ్యం గా ఉన్నారన్న వార్తలు వాస్తవమేనని అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా అశోక్ తేజ ఆరోగ్యంపై వివరణ ఇస్తూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్-గౌతమ్ ల హైట్ చెక్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పర్సన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు సినిమా షూటింగ్స్ లేని సమయంలో ఎక్కువగా ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతుంటాడు.తనకు ఏ మాత్రం ఖాళీ దొరికినా కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు మహేష్. అలాంటిది ఇప్పుడు లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ ఆగిపోవడంతో గత రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటూ సితార, గౌతమ్ లతో కలిసి ఆటపాటలతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'భారతీయుడు2' లొకేషన్ ఛేంజ్..!

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 23 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమాకు మొదటినుండి పలు అడ్డంకులే ఎదురయ్యాయి అని చెప్పొచ్చు. వాటన్నిటిని తట్టుకొని ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ను జరుపుకోగా.. లాక్‌డౌన్‌కు ముందు షూటింగ్‌ స్పాట్‌లో జరిగిన ప్రమాదం కారణంగా షూటింగ్‌ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కరోనా వచ్చి పడి ఇంకా పెద్ద బ్రేక్ పడింది.

TFN Adminవాట్సాప్
నేను బాగానే ఉన్నాను - రూమర్లకు అనుష్క చెక్
సినిమా వార్తలు

నేను బాగానే ఉన్నాను - రూమర్లకు అనుష్క చెక్

ప్రస్తుతం అనుష్క హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న 'నిశ్శబ్దం' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పలు లాంగ్వెజస్ లో రూపొందుతున్న ఈసినిమా ఇతర భాషల్లో 'సైలెన్స్' పేరుతో రిలీజ్ కానుంది. అమెరికాలోని సియాటిల్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కల్కీ రన్ టైమ్ లాక్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా కల్కీ. రేపు విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్ర బృందం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. తాజాగా ఈసినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేశారు. 2 గంటల 22 నిమిషాల రన్ టైమ్ కలిగి ఉంది. మరి ఒక థ్రిల్లర్ మూవీకి ఇంత టైమ్ అంటే గొప్ప విషయమే. మరి సినిమా ఎలా ఉంటుందో చూద్దాం.

TFN Adminవాట్సాప్

షేర్